https://oktelugu.com/

Ind Vs Nz 1st Test: టీమిండియా చిత్తుగా.. చెత్తగా.. స్వదేశంలో కివీస్ చేతిలో రోహిత్ సేన పరువు గంగలో..

స్వ దేశంలో భారత జట్టును కివీస్ 36 ఏళ్లుగా ఓడించలేదు. కానీ ఈసారి సీన్ మారేలా కనిపిస్తోంది. అన్ని వభాగాలలో భారత్ కంటే వెనుకబడి ఉన్న న్యూజిలాండ్.. ఈసారి అద్భుతాన్ని ఆవిష్కరించే అవకాశం కళ్ళ ముందు దర్శనమిస్తోంది..18 టెస్ట్ సిరీస్ లను సొంత గడ్డపై గెలిచిన టీమిండియా.. కివీస్ పై తడబడింది. ఆస్ట్రేలియా లాంటి జట్లను ఓడించిన భారత్.. కివీస్ చేతిలో వణికి పోయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 17, 2024 / 03:50 PM IST

    Ind Vs Nz 1st Test(1)

    Follow us on

    Ind Vs Nz 1st Test: సూపర్బ్ ఫామ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ కేవలం 13 పరుగులకు ఔట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ 2 పరుగులకు పెవిలిన్ చేరుకున్నాడు. కోహ్లీ(0), సర్పరాజ్ ఖాన్(0), రాహుల్(0), రవీంద్రజడేజా(0), అశ్విన్(0) ఇలా కీలక ఆటగాళ్లు సున్నా పరుగులకు కు ఔటయ్యారు. కివీస్ చేతిలో పరువు పొగొట్టుకున్నారు. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా కివీస్ జట్టుుతో భారత్ బెంగళూరు వేదికగా తొలి టెస్ట్ ను మొదలుపెట్టింది. వర్షం వల్ల తొలిరోజు ఆట మొదలుు కాలేదు. గురువారం వర్షం తగ్గడంతో మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన భారత జట్టుు కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు. అతడి నిర్ణయం తప్పని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. తొమ్మిది పరుగుల వద్ద రోహిత్ ఔట్ కావడంతో ఒక్కసారిగా భారత్ కు షాక్ తగిలింది. ఆ తర్వాత వికెట్ల పతనం నిరాటంకంగా సాగింది. అసలు భారత్ ఆడుతోంది స్వదేశంలోనా? కివీస్ లోనా అన్నట్టుగా బ్యాటింగ్ సాగింది. భారత జట్టులో పంత్(20) పరుగులే హైయ్యస్ట్ స్కోర్ అంటే భారత జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కివీస్ బౌలర్ల ధాటికి భారత జట్టుకు చెందిన విరాట్, సర్ఫరాజ్, రాహుల్, రవీంద్రజడేజా, అశ్విన్ సున్నా పరుగులకు పెవిలియన్ చేరుకున్నారు.

    హెన్రీ ఐదు వికెట్లు

    భారత జట్టుు టాప్ ఆర్డర్ కుప్ప కూలడంతో కివీస్ బౌలర్ హెన్రీ కీలక పాత్ర పోషించాడు. పంత్, సర్ఫరాజ్, రవీంద్ర జడేజా, అశ్విన్ వంటి ఆటగాళ్లు డక్ ఔట్ గా వెను దిరిగారు. విలియం ఓరూర్కే నాలుగు వికెట్టు పడగొట్టాడు. ఓరూర్కే యశస్వి జైస్వాల్, కోహ్లీ, రాహుల్, బుుమ్రా వికెట్లను సొంతం చేసుకున్నాడు. మొత్తంగా హెన్రీ, ఓరూర్కే తొమ్మిది వికెట్లను నేలకూల్చారు. 46 పరుగులకు కుప్పకూలడం ద్వారా భారత్ అనేక చెత్త రికార్డులను నమోదు చేసింది. 1986లో పైసలాబాద్ లో పాక్ జట్టుతో తలపడిన విండీస్ 53 పరుగులకే కుప్పకూలింది. 2002లో షార్జాలో ఆసీస్ పై 53 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది. అయితే ఆ రికార్డులను భారత్ బదులు కొట్టింది. అత్యంత తక్కువ పరుగులు చేసి చెత్త రికార్డును మూటగట్టుకుంది. టాస్ గెలిచిన రోహిత్ బౌలింగ్ వైపు మొగ్గు చూపి ఉంటేే బాగుుండేది. కానీ అతడు బ్యాటింగ్ ఎంచుకోవడంతో కివీస్ బౌలర్లు పండగ చేసుకున్నారు. మైదానంపై తేమను వినియోగించుకుని బౌన్స్ రాబట్టారు. వికెట్ల మీద వికెట్లను పడగొట్టారు. పంత్ మినహా మిగతా ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అసలు చూస్తోంది భారత్ ఆడుతున్న మ్యాచ్ నేనా అని మైదానంలో ఉన్న అభిమానులు ఆశ్చర్యపోయేలా మన ఆటగాళ్లు కివీస్ బౌలర్ల ముందు తలవంచారు. స్వదేశంలో కివీస్ ముందు పరువు పోగొట్టుకున్నారు.