Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై హస్త, చిత్రా నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఈరోజు నుంచి దుర్గాదేవి నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారిపై అమ్మవారి అనుగ్రహం ఉండనుంది. మహావిష్ణువు అనుగ్రహంతో మరికొన్ని రాశులు సమస్యల నుంచి బయటపడుతారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. పెట్టుబడుల విషయంలో పెద్దలను సంప్రదించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కార్యాలయాల్లో ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అదనపు భారం పడుతుంది.
మిథున రాశి:
కొన్ని విషయాల్లో తొందరపడొద్దు.మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి:
వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్త ఒప్పందాలపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సాయంత్రం స్నేహితులతో సరదాగా ఉంటారు. ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి.
సింహారాశి:
కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. సోదరుల సహాయంతో పెట్టుబడులు పెడుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. సాయంత్రి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రియమైన వారితో విహారయాత్రలకు వెళ్తారు.
కన్య రాశి:
జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వివిహ ప్రయత్నాలు మొదలవుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.
తుల రాశి:
పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఈరోజు ఈ రాశి వారిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి:
బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కుటుంబ సంబంధాల్లో చీలికలు ఏర్పడుతాయి. కొన్ని విషయాల్లో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి:
శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఓ సమాచారం సంతోషంగా కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్ పనులు ఇబ్బందిని కలిగిస్తాయి. అందువల్ల వాటిని వెంటనే పూర్తి చేయడానికి కృషి చేయాలి.
మకర రాశి:
వ్యాపారులు కొత్త ఒప్పందాలను ఏర్పాటు చేసుకుంటారు. విద్యార్థుల చదువుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.
కుంభరాశి:
ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోైనా వివాదం ఏర్పడితే మాటలను అదుపులో ఉంచుకోవాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం. అధిక ఆదాయం పొందుతారు.
మీనరాశి:
మాటలను అదుపులో ఉంచుకోవాలి. శత్రువులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. సాయంత్రం కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చులు ఉంటాయి.