https://oktelugu.com/

Wife : భార్యలు ఎక్కువ చిరాకుగా ఎందుకు ఉంటారు? దీనికి కారణం ఏంటి?

తల్లులుగా మారిన తర్వాత వివాహిత మహిళల్లో ఒత్తిడి ఉంటుందని, కాకపోతే అది పిల్లల వల్ల కాదని భర్తల వల్లే చిరాకుగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఇంటి పనులు, వ్యక్తిగత సమస్యలు, ఇంటి పనుల వల్ల మహిళలు ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల చిరాకుగా ఉంటారని ఓ అధ్యయనంలో కూడా తేలింది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 4, 2024 / 05:29 AM IST

    wives irritable

    Follow us on

    Wife : పెళ్లికి ముందు భార్యలు చాలా సంతోషంగా ఉంటారు. నవ్వుతూ, సంతోషంగా అన్ని విషయాల్లో యాక్టివ్‌గా ఉంటారు. కానీ పెళ్లయిన తర్వాత భార్యలు ప్రతి చిన్న విషయానికి చిరాకుగా ఉంటారని కొందరు భర్తలు అంటుంటారు. సాధారణంగా భర్తలు ఎక్కువ కోపంగా ఉంటారు. ఎందుకంటే ఇంట్లో సమస్యలు, ఆఫీస్‌లో వర్క్ ఒత్తిడి వల్ల భార్యలతో చిరాకుగా ఉంటారు. కానీ భర్తల కంటే భార్యలే ఎక్కువగా చిరాకుగా ఉంటారట. అయితే పెళ్లయిన తర్వాత మహిళల్లో ఎక్కువగా ఒత్తిడి ఉండటం వల్ల చిరాకుగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. తల్లులుగా మారిన తర్వాత వివాహిత మహిళల్లో ఒత్తిడి ఉంటుందని, కాకపోతే అది పిల్లల వల్ల కాదని భర్తల వల్లే చిరాకుగా ఉంటారని నిపుణులు అంటున్నారు. ఇంటి పనులు, వ్యక్తిగత సమస్యలు, ఇంటి పనుల వల్ల మహిళలు ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల చిరాకుగా ఉంటారని ఓ అధ్యయనంలో కూడా తేలింది.

    మొత్తం 7000 మందికి పైగా నిర్వహించిన సర్వేలో 46 శాతం మంది తల్లులు పిల్లల కంటే భర్తల వల్లే ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. అయితే మహిళలు ఎక్కువగా ఒత్తిడికి గురి కావడనికి ముఖ్య కారణం భర్తలు ఇంటి పనుల్లో సాయం చేయకపోవడమే అని ఈ సర్వేలో తేలింది. పిల్లలను పెంచడం, ఇంటి పనులు బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడతారని అధ్యయనంలో తేలింది. భార్యలు ఎక్కువ కాలం ఒత్తిడికి గురైతే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. భార్యాభర్తలు అన్న తర్వాత అన్ని విషయాల్లో కలిసి మెలసి ఉండాలి. ప్రతి పనిని కూడా ఇద్దరూ షేర్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. భార్యకు భర్త సపోర్ట్ ఉంటే ఆమె జీవితం సంతోషంగా ఉంటుంది. అప్పుడు వాళ్లు ఎలాంటి టెన్షన్‌లు లేకుండా భర్తలతో ఉంటారు. కాబట్టి భార్యలను భర్తలు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

    భర్తలు వారి వర్క్ బిజీల్లో ఉన్న కూడా భార్యకు సపోర్ట్‌గా ఉండాలి. కాస్త అన్ని పనుల్లో భార్యకు సాయం చేస్తుండాలి. కొందరు భర్తలు అయితే అసలు చిన్న విషయంలో కూడా భార్యను తప్పు పడతారు. కనీసం తనని ఏ విషయంలో కూడా సపోర్ట్ చేయరు. ఇలాంటి ప్రవర్తన ఉన్న భర్తలను భార్యలు చిరాకు పడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళలకు పురుషుల సపోర్ట్ ఉంటే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని సర్వేలో తేలింది. కాబట్టి మీ భార్యకు ప్రతి విషయంలో సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల వారు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది మహిళలు భర్తలతో విడిపోయిన తర్వాత బాగా ఒత్తిడికి గురవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే భార్యాభర్తల బంధం మెంటల్‌గా, ఫిజికల్‌గా సంతోషంగా ఉండాలి. అప్పుడే బంధం కలకాలం సంతోషంగా ఉంటుంది. భార్యలు కూడా ఒత్తిడికి గురి కాకుండా మెంటల్‌గా స్ట్రాంగ్‌ ఉంటారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఇవన్నీ కొన్ని అధ్యయనాల ద్వారా మాత్రమే తెలియజేయడం జరిగింది.