Homeఆంధ్రప్రదేశ్‌Child Behaviour: బాల ఉన్మాదులను.. దారిలో పెట్టేది ఎవరు?

Child Behaviour: బాల ఉన్మాదులను.. దారిలో పెట్టేది ఎవరు?

Child Behaviour: పాఠశాల అంటే.. చదువులకు చిరునామా.. పిల్లల మాటలు.. ఆటలు.. పాటలు వంటి వాటితో విలసిల్లే పవిత్రమైన ప్రాంతం. అటువంటి పాఠశాలలు దారుణాలకు కేంద్రమవుతున్నాయి. విద్యార్థులు చదువుకోవాల్సిన చోట నెత్తుటి మరకలు కనిపిస్తున్నాయి. అమాయకమైన పిల్లలపై తోటి విద్యార్థులు దారుణమైన దాడులకు దిగుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. హర్యాన రాష్ట్రంలో పంచకుల ప్రాంతంలో తాజాగా జరిగిన ఘటన మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాన్ని.. పిల్లల ఆలోచన తీరును ఎత్తిచూపుతోంది. హర్యానా రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలో సెక్టార్ […]

Child Behaviour: పాఠశాల అంటే.. చదువులకు చిరునామా.. పిల్లల మాటలు.. ఆటలు.. పాటలు వంటి వాటితో విలసిల్లే పవిత్రమైన ప్రాంతం. అటువంటి పాఠశాలలు దారుణాలకు కేంద్రమవుతున్నాయి. విద్యార్థులు చదువుకోవాల్సిన చోట నెత్తుటి మరకలు కనిపిస్తున్నాయి. అమాయకమైన పిల్లలపై తోటి విద్యార్థులు దారుణమైన దాడులకు దిగుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. హర్యాన రాష్ట్రంలో పంచకుల ప్రాంతంలో తాజాగా జరిగిన ఘటన మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాన్ని.. పిల్లల ఆలోచన తీరును ఎత్తిచూపుతోంది.

హర్యానా రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలో సెక్టార్ 20 లో సంస్కృతి మోడల్ స్కూల్ ఉంది. ఈ పాఠశాలలో జరిగిన సంఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇక్కడ కేజీ చదువుతున్న ఒక చిన్నారిపై.. ఇదే పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న ఒక బాలుడు ఇటుకరాలతో దారుణంగా దాడి చేశాడు. బాలుడు చేసిన దాడుల వల్ల ఆ పాప స్పృహ కోల్పోయింది. ఆ పాపను ప్రస్తుతం ఒక ఆసుపత్రికి తరలించారు. అతడు చేసిన దాటికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాల ద్వారా బయటికి రావడంతో.. వాస్తవం ఏంటనేది తేలింది.

ఇక రాప్తాడులో పదవ తరగతి చదివే విద్యార్థిని మీద.. ఒక యువకుడు తరగతి గదిలో అందరూ చూస్తుండగానే రంపం తో దాడి చేశాడు. ఈ దాడిలో ఆ బాలిక చెయ్యి తెగిపోయింది. ముఖం మీద తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమకు నిరాకరించడం వ ల్లే అతడు ఈ స్థాయిలో దారికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఇక నల్గొండ జిల్లాలో స్కూల్ ప్రిన్సిపాల్ ను అదే పాఠశాలలో చదివే విద్యార్థులు అత్యంత దారుణంగా చంపేశారు. ఆమె దగ్గర ఉన్న డబ్బులను దొంగిలించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగించింది.

వాస్తవానికి చిన్న పిల్లలు ఇలా మారిపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి అంటున్నారు సైకాలజిస్టులు. ఈ విపరీత ధోరణికి అడ్డుగడ్డ వేయాలంటే పోలీసు కేసులు మాత్రమే సరిపోవని చెబుతున్నారు. తల్లిదండ్రులు.. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలని చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో ప్రతిరోజు సమయం కేటాయించాలని.. వారితో మాట్లాడాలని.. వారి మాట తీరును పరిశీలించాలని.. పాఠశాలలో వారికి ఎదురైనా అనుభవాలు.. స్నేహితుల గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చేటప్పుడు.. వారు చూస్తున్న కంటెంట్.. ఆడుతున్న గేమ్ లపై నిరంతరం పర్యవేక్షించాలని చెబుతున్నారు. హింసాత్మకమైన ఆటలకు దూరంగా ఉండే విధంగా చేయాలని. ఇంట్లో ఏమాత్రం గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం అందించాలని.. కోపాన్ని కాకుండా.. ప్రేమతో వారిని దగ్గర తీసుకోవాలని చెబుతున్నారు.. పాఠశాలల్లో కూడా సైకాలజిస్టులను నియమించుకోవాలని.. వారితో ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ అందించాలని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. మార్కులు.. ర్యాంకులు కాకుండా.. మానవీయకోణం.. ఇతరులను గౌరవించడం.. తోటి వారి మీద దయ కలిగి ఉండే వాటి లక్షణాలను పెంపొందించాలని సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper