https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : బయటపడ్డ స్టార్ మా పక్షపాతం.. శోభను రక్షించేందుకు మాస్టర్ ప్లాన్!

12వ వారం నామినేషన్స్ కి సంబంధించి లైవ్ అప్డేట్ చూస్తే ప్రియాంక కెప్టెన్ కాబట్టి మినహాయింపు లభించింది. ఇక శోభా బిగ్ బాస్ దత్త పుత్రిక కావడంతో ఆమెను కూడా నామినేషన్స్ నుంచి తప్పించారు

Written By: , Updated On : November 20, 2023 / 09:37 PM IST
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ లో శోభా శెట్టి నామినేషన్ లో ఉన్న ప్రతి సారి ఆమెకు లీస్ట్ ఓటింగ్ రావడం .. అయినా కూడా ఆమె సేవ్ అయిపోవడం. ఇది ఎప్పుడూ జరిగే తంతే. శోభా ని బిగ్ బాస్ కాపాడుతూ వస్తుండడం పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేకపోతే .. శోభా శెట్టి ఇంతవరకు హౌస్ లో ఉండటం ఏంటి .. రతికకి ఓట్లు పడటం ఏంటి .. ఆమె రీ ఎంట్రీ తర్వాత నామినేషన్స్ లో ఉంటూనే ఉంది. కానీ ఎలా సేవ్ అవుతుంది అనేది అంతుచిక్కని విషయం.

ఇక ఈ వారం మరో ట్విస్ట్ ఏంటంటే శోభా నామినేషన్స్ లోకి రావడం .. జనాలు ఆమెకు ఓట్లు వేయకపోవడం .. చివర్లో బిగ్ బాస్ సేవ్ చేయడం ఇదంతా ప్రతి వారం చూస్తూనే ఉన్నాం. దీంతో ఆమె ఎలిమినేషన్ పై విమర్శలు వస్తుండడంతో.. ఈసారి రూట్ మార్చేశాడు బిగ్ బాస్. షాకింగ్ అప్డేట్ ఏంటంటే.. 12వ వారం నామినేషన్స్ లో శోభ శెట్టి లేదు. అయితే శోభా శెట్టిని ఎవరు నామినేట్ చేయకూడని నిబంధనల్లో భాగంగా .. ఆమెను ఎవరు నామినేట్ చేయలేదని తెలుస్తోంది.

రతిక, గౌతమ్, అశ్విని, శివాజీ వాళ్ళు నలుగురు కూడా శోభని నామినేట్ చేయాల్సిన వాళ్లే. ఇంకా చెప్పాలంటే .. నామినేషన్స్ లో ఎక్కువ ఓట్లు పడాల్సింది శోభకే. కానీ .. బిగ్ బాస్ ఆదేశాలతో శోభని నామినేట్ చేయకుండా స్క్రిప్ట్ అందించారట. ఆమె నామినేషన్స్ లో ఉండడం .. బిగ్ బాస్ సేవ్ చేయడం. ఈ గోలంతా ఎందుకు అనుకున్నాడేమో .. 12వ వారం శోభాని అసలు నామినేషన్స్ లో లేకుండా చేశాడట బిగ్ బాస్.

12వ వారం నామినేషన్స్ కి సంబంధించి లైవ్ అప్డేట్ చూస్తే ప్రియాంక కెప్టెన్ కాబట్టి మినహాయింపు లభించింది. ఇక శోభా బిగ్ బాస్ దత్త పుత్రిక కావడంతో ఆమెను కూడా నామినేషన్స్ నుంచి తప్పించారు. మిగిలిన ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. గౌతమ్, శివాజీ, అర్జున్, యావర్, ప్రశాంత్, అశ్విని, రతిక, అమర్ దీప్ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. ఈ విధంగా స్టార్ మా పక్షపాతంగా బయటపడిందని బయట టాక్.