https://oktelugu.com/

The Railway Men Telugu Review: ది రైల్వే మేన్ సీరీస్ ఫుల్ రివ్యూ…

The Railway Men Telugu Review: ప్రస్తుతం వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమాలు గానీ, సిరీస్ లు గాని ఎక్కువగా వస్తున్నాయి. ప్రేక్షకుల్లో కూడా వాటి మీద విపరీతమైన అంచనాలు ఉంటున్నాయి. ఇక వాటికి అనుగుణంగానే అలాగే ప్రేక్షకుల మైండ్ సెట్ కి తగ్గట్టుగానే దర్శకులు వాటిని తెరకెక్కించి సక్సెస్ ని అందుకుంటున్నారు…నిజానికి రెగ్యులర్ సినిమాలను చూసి బోర్ గా ఫీల్ అవుతున్న ప్రేక్షకులు ఇలాంటి కొత్త తరహా పాత్రలు వచ్చినపుడు ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ పెద్దహిట్లుగా […]

Written By: , Updated On : November 20, 2023 / 10:28 PM IST
The Railway Men Telugu Review

The Railway Men Telugu Review

Follow us on

The Railway Men Telugu Review: ప్రస్తుతం వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమాలు గానీ, సిరీస్ లు గాని ఎక్కువగా వస్తున్నాయి. ప్రేక్షకుల్లో కూడా వాటి మీద విపరీతమైన అంచనాలు ఉంటున్నాయి. ఇక వాటికి అనుగుణంగానే అలాగే ప్రేక్షకుల మైండ్ సెట్ కి తగ్గట్టుగానే దర్శకులు వాటిని తెరకెక్కించి సక్సెస్ ని అందుకుంటున్నారు…నిజానికి రెగ్యులర్ సినిమాలను చూసి బోర్ గా ఫీల్ అవుతున్న ప్రేక్షకులు ఇలాంటి కొత్త తరహా పాత్రలు వచ్చినపుడు ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ పెద్దహిట్లుగా మారుస్తున్నారు.అలా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిందే ది రైల్వే మేన్ అనే సీరీస్…భూపాల్ లో గ్యాస్ లీక్ దుర్ఘటన నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ వచ్చిన ఈ సీరీస్ ఇప్పుడు ఓటీటీ లో రచ్చ చేస్తుందనే చెప్పాలి.. ప్రస్తుతం ఈ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇక ఈ సీరీస్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ముందుగా ఈ కథ విషయానికి వస్తే భోపాల్ రైల్వే స్టేషన్ లోని స్టేషన్ మాస్టర్ అయిన ఇఫ్తికర్ సిద్ధిఖీ (కేకే మేనన్)
అందరినీ బాగా పలకరిస్తూ అందరితో గౌరవంగా ఉంటూ, అందరిని బాగా చూసుకుంటూ ఎవరికీ ఏ అవసరం పడిన కూడా సహాయం చేస్తూ ఉంటాడు…ఇక ఇదే సమయం లో యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీని ఓ విదేశీ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. భద్రత విషయంలో కనీస ప్రమాణాలు కూడా పాటించకుండ ఫ్యాక్టరీలోని లోపాలను సీనియర్‌ వర్కర్లు ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్తే కంపెనీ నష్టాల గురించి మాట్లాడుతాడు తప్ప, మిగిలినవి ఏవీ పరిగణనలోకి తీసుకోడు.ఇలా వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వాళ్ల ఒక పెను ప్రమాదం జరుగుతుంది ఇక దాని నుంచి భోపాల్ ప్రజలు ఎలా బయట పడ్డారు అనేదే దాని మూలంగా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు అనేది తెలియాలంటే మీరు ఈ సీరీస్ చూడాల్సిందే…

ఇక ఈ సీరీస్ ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…

దర్శకుడు శివ్ రావైల్ భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ సంఘటనని తీసుకొని ఎక్కడ కూడా డీవియెట్ అవ్వకుండా కథని కథగా తీసుకొని దాన్ని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా 1984 నాటి పరిస్థితులను రీ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అలాగే సినిమా తాలూకు ఎమోషన్ ని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఫ్లోలో తీసుకెళ్లి చివరి వరకు సస్టైన్ చేస్తూ ప్రతి క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ ఇస్తు చెప్పే పాయింట్ ని చాలా డెప్త్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు… కొన్ని సీన్ లలో మాత్రం చూసే వాళ్ళ కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేంత లా మేస్మరైజ్ చేస్తూ డైరెక్టర్ ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేస్తూ తీయడం ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి…ఇక గ్యాస్ లీక్ అయినప్పుడు చూపించిన విజువల్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి.ఇక ప్రేక్షకుడు అది నిజంగా ఇప్పుడు జరుగుతుందేమో అని అనుకునేలా ఈ టైం ని మరిచిపోయి ఆ టైం లోకి వెళ్ళిపోతాడు అంటే అక్కడ డైరెక్టర్ గొప్పతనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక అలాగే స్క్రీన్ ప్లే విషయంలో కూడా దర్శకుడు చాలా వరకు ఒక కొత్త పంథా లో సినిమాని ఎంగేజింగ్ గా ముందుకు తీసుకెళ్ళాడు…

ఇక నటీనటుల విషయానికి వస్తె ఈ సినిమా మొత్తం తనమీదనే ఆధారపడి ఉండటం తో స్టేషన్‌ మాస్టర్ గా ఇఫ్తికార్‌ పాత్రలో కేకే మేనన్‌ టాప్ నాచ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. పర్ ఫెక్ట్ గా స్టేషన్ మాస్టర్ గా పరకాయ ప్రవేశం చేశాడు…స్టేషన్ మాష్టర్ ఫ్రెండ్ పాత్ర లో ఏ ఒక్కరి ప్రాణాలు కూడా పోకూడదు అని తాపత్రయ పడే యువకుడిగా ఇమద్‌ పాత్రలో బాబిల్‌ఖాన్‌ ప్రాణం పెట్టీ నటించాడు.. ఇక భోపాల్‌ జంక్షన్‌లో దొంగతనం చేయడానికి వచ్చి, మనసు మార్చుకుని, ప్రయాణికులకు సాయం చేసే వ్యక్తిగా దివ్యేందు శర్మ చక్కగా ఒదిగి పోయి నటించడమే కాకుండా తన పాత్ర తో చివర్లో కన్నీళ్లు కూడా పెట్టించాడు ఇక అధ్యంతం ఉత్కంఠగా సాగే ఈ సిరీస్‌లో ఈ పాత్రే కాస్త రిలీఫ్‌ ని కూడా ఇస్తుంది. విలేకరిగా సున్నీ హిందూజా, జీఎంగా మాధవన్‌, జుహీ చావ్లా, మందిరాబేడీ ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ల క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటిస్తూనే ఈ సీరీస్ విజయానికి కారణం అయ్యారు…

టెక్నికల్‌గా చూసుకుంటే ఈ సిరీస్‌ కోసం టెక్నికల్‌ టీమ్‌ పడిన కష్టం తెరపైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యం గా ఈ సీరీస్ లోని కొన్ని సీన్లలో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అయిన సామ్‌ స్లాటర్‌ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ సినిమాకు ప్రాణం పోసింది.ఇక విజువల్స్ గా సినిమాటోగ్రఫర్ రుబైస్ మాత్రం తన ప్రాణం పెట్టీ ఒక్కో షాట్ ఒక్కో వేరియేశన్ లో తీసి ఈ సీరీస్ ని విజువల్స్ గా ప్రేక్షకులకి బాగా దగ్గర చేశాడు….ఇక ఈ సీరీస్ కోసం వేసిన కొన్ని సెట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా లైటింగ్ తో 1984 నాటి విజువల్స్ ని వాటి సోల్ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా చేసి చూపించారు…నిజానికి దర్శకుడి కష్టం ప్రతి ఫ్రేం లో కనిపిస్తుంది…
ఇక ఈ సినిమా అందరూ తప్పకుండా చూడాల్సిన సీరీస్ ఎందుకంటే చరిత్ర గురించి వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు కాబట్టి భోపాల్ నేపథ్యం మాటున దాగిన ఆ విజువల్స్ ని చూస్తేనే ఆ ఫీల్ పొందగలుగుతారు…

ఇక ఈ సీరీస్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే…

కథ కథనం…
నటినటుల పర్ఫామెన్స్…
కొన్ని సీన్స్ లలో సినిమాటోగ్రఫీ బాగుంది.
1984 బ్యాక్ డ్రాప్ ని చాలా బాగా రీ క్రియేట్ చేసారు…

ఇక ఈ సీరీస్ మైనస్ పాయింట్లు వచ్చేసి…

సినిమా లెంతి గా ఉండటం వల్ల మధ్యలో కొద్దిగా బోర్ వస్తుంది…
ఎడిటర్ పని తీరు ఇంకా కొంచం బెటర్ గా ఉంటే ఇంకా బాగుండేది…

ఇక ఈ సీరీస్ కి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5