Narendra Modi – Team India : అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో మెన్ ఇన్ బ్లూ ఓడిపోయిన ఆటగాళ్లందరూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. దు: ఖాన్ని ఆపుకోలేకపోయారు. ఇది చూసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించారు. 241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 6 వికెట్లు, మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే దానిని ఛేదించింది. ఫైనల్ ముగిసే సమయానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటతడి పెట్టారు. ఓటమి తర్వాత మిగిలిన జట్టు సభ్యులు కూడా చాలా ఎమోషనల్‌గా కనిపించారు.
పది వరుస విజయాల నేపథ్యంలో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే చాలా బలమైన ఆస్ట్రేలియన్ ప్రదర్శనతో ఫైనల్ లో ఓడిపోయింది. ఆటలో భారత్ ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించలేదు. బంతితోనూ తేలిపోయింది. పది ఓవర్ల తర్వాత మ్యాచ్ ఎల్లప్పుడూ భారత్ వైపు మళ్లలేదు. దు:ఖాన్ని ఆపుకోలేకపోయిన టీమిండియా ఆటగాళ్లను ఓదార్చేందుకు మోడీ స్వయంగా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లారు. భారత ఆటగాళ్లు షమీ, జడేజీ సహా అందరినీ ఓదార్చారు.
జడేజా దీనిపై ఏమోషనల్ అయ్యి ఆ ఫొటో షేర్ చేసి రాసుకొచ్చాడు. “మేము ఒక గొప్ప టోర్నమెంట్ ఆస్వాదించాం. కానీ నిన్న చివర్లో చిన్నగా ముగించాము. మనమందరం హృదయ విదారకంగా ఉన్నాము, కానీ మా ప్రజల మద్దతు మమ్మల్ని ముందుకు తీసుకువెళుతోంది. నిన్న ప్రధాని మోడీ గారు డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి మాకు చెప్పిన ధైర్యం ప్రత్యేకమైనది. చాలా ప్రేరణ కలిగించింది.” అని రాసుకొచ్చాడు.
బీసీసీఐ సెక్రటరీ జే షా కూడా ఫైనల్‌లో ఓడిపోయినప్పటికీ భారత జట్టును ప్రశంసించారు. టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు అద్భుతంగా ఆడిందని చెప్పాడు. జట్టు చాలా కష్టపడి, క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకుందని, ఫైనల్ లో ఒక చెడు రోజు టోర్నీని ముగించిందని.. దాంట్లో బాధలేదని షా చెప్పాడు. మెన్ ఇన్ బ్లూ సాధించిన పనికి దేశం మొత్తం గర్విస్తోందన్నారు.
మొత్తంగా ఇచ్చిన ధైర్యం.. వెన్నుతట్టి ప్రోత్సహించిన విధానానికి ఆటగాళ్లు స్వాంతనకు లోనయ్యారు. మోడీ ఇలా చేయడంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
We had a great tournament but we ended up short yesterday. We are all heartbroken but the support of our people is keeping us going. PM @narendramodi’s visit to the dressing room yesterday was special and very motivating. pic.twitter.com/q0la2X5wfU
— Ravindrasinh jadeja (@imjadeja) November 20, 2023