https://oktelugu.com/

Bigg Boss Season 8 : బిగ్ బాస్ సీజన్ 8 లో ‘లక్కీ డ్రా’..మొదటి రోజే ఎలిమినేషన్..చరిత్రలో తొలిసారి!

జనాల ఓటింగ్ ద్వారా మాత్రమే ఎలిమినేషన్ ఉంటుంది కానీ, సొంతంగా ఎలిమినేట్ చేసే హక్కు బిగ్ బాస్ కి లేదు. కాబట్టి లక్కీ డ్రా ద్వారా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపే అవకాశం ఉంది. లేదా వాళ్ళని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : September 1, 2024 / 02:19 PM IST

    Bigg Boss Season 8

    Follow us on

    Bigg Boss Season 8 : కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 నేడు సాయంత్రం నుండి మొదలు కానుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని నిన్ననే పూర్తి చేసారు. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా 14 మంది నిన్ననే హౌస్ లోకి అడుగుపెట్టారు. అందులో 7 మంది అమ్మాయిలు, 7 మంది అబ్బాయిలు ఉన్నారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వడం, వాళ్ళు మాట్లాడడం, హౌస్ లోకి వెళ్లడం వంటివి చూపించారు. అంతే కాకుండా ఈ ఎపిసోడ్ కి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి, నివేదా థామస్, అనిల్ రావిపూడి వంటి టాప్ సెలబ్రిటీస్ ఈ ఎపిసోడ్ కి అతిథులుగా విచ్చేసారు. వీళ్ళతో నాగార్జున సరదాగా మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.

    ఇది ఇలా ఉండగా కంటెస్టెంట్స్ కి మొదటి రోజే బిగ్ బాస్ ఊహించని ట్విస్టులు ఇచ్చాడు. హౌస్ లోకి సోలో గా అడుగు పెట్టనివ్వకుండా, జంటలుగా అడుగుపెట్టించారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఈ ప్రోమో లో చూపించిన మరో బీభత్సమైన ట్విస్ట్ ఏమిటంటే, డైరెక్టర్ అనిల్ రావిపూడి ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతాడు నాగార్జున. హౌస్ లోకి వెళ్లిన తర్వాత అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఇప్పుడు మేము ఒక లక్కీ డ్రా తీయబోతున్నాం. ఈ లక్కీ డ్రా ద్వారా ఒక జంటని ఎలిమినేట్ చేసి, మరో జంటని లోపాలకి పంపబోతున్నాము’ అని అంటాడు. అంటే మొదటి రోజే ఎలిమినేషన్ అన్నమాట. అయితే బిగ్ బాస్ అంత తేలికగా ఎలిమినేట్ చెయ్యడు.

    జనాల ఓటింగ్ ద్వారా మాత్రమే ఎలిమినేషన్ ఉంటుంది కానీ, సొంతంగా ఎలిమినేట్ చేసే హక్కు బిగ్ బాస్ కి లేదు. కాబట్టి లక్కీ డ్రా ద్వారా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపే అవకాశం ఉంది. లేదా వాళ్ళని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఏకంగా 7 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారట. వారిలో ముగ్గురు పాత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ కూడా ఉంటారు. ఇది ఇలా ఉండగా నిన్న హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకసారి చూస్తే ఆదిత్య ఓం, నిఖిల్, ప్రేరణ, యష్మీ గౌడా, అభయ్ నవీన్ (పెళ్లి చూపులు ఫేమ్), శేఖర్ బాషా, నాగ మణికంఠ (యూట్యూబర్), నైనికా, కిరాక్ సీత (బేబీ ఫేమ్), యాంకర్ విష్ణుప్రియ, పృథ్వి రాజ్ శెట్టి (నాగ పంచమి సీరియల్ హీరో), నబీల్ అఫ్రీది తదితరులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా గత సీజన్ కంటెస్టెంట్ శోభా శెట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.