Rahul Gandhi : రాహుల్‌ను వెంటాడుతున్న జర్నలిస్టు.. సాక్ష్యాలతో గుట్టు రట్టు చేస్తున్న బంగ్లాదేశ్‌ రిపోర్టర్‌.. ఆయన మౌనం అంగీకారమేనా..!?

రాహుల్‌ గాంధీ.. పరిచయం అక్కరలేని పేరు. 2019 పార్లమెంటు ఎన్నికల వరకు ఆయన ఒక ఫెల్యర్‌ లీడర్‌గా ప్రొజెక్టు అయ్యారు. రాజకీయ పరిణతి లేకపోవడం కూడా ఆయన వైఫల్యానికి కారణం. కానీ, 2024 ఎన్నికల నాటికి పూర్తిగా మారిపోయారు. ఫలితం మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

Written By: Raj Shekar, Updated On : September 1, 2024 2:24 pm

Rahul Gandhi

Follow us on

Rahul Gandhi : రాహుల్‌ గాంధీ.. నెహ్రూ మునిమనుమడిగా, ఇందిరాగాంధీ మనుమడిగా, రాజీవంగాంధీ తనయుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టాడు. కుటుంబం తరతరాలుగా రాజకీయాల్లో ఉన్నా.. రాహుల్‌ మాత్రం మొన్నటి వరకు పెద్దగా రాజకీయ పరిణతి చూపలేదు. దీంతో కాంగ్రెస్‌ జాతీయ అద్యక్షుడిగా పనిచేసినా పెద్దగా ఫలితాలు రాలేదు. మరోవైపు మీడియా, సోషల్‌ మీడియా కూడా రాహుల్‌ను ఫెయిల్యూర్‌ లీడర్‌గా ప్రొజెక్టు చేశాయి. ఇందుకు తగినట్లుగానే రాహుల్‌ పెద్దగా రాజకీయ పరిణతి ప్రదర్శించలేదు. కానీ 2023లో ఆయన చేపట్టిన భారత్‌ జోడో యాత్ర రాహుల్‌కు మంచి మైలేజీ తెచ్చింది. ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు చేపట్టిన యాత్రలో అనేక విషయాలు నేర్చుకున్నారు. దాని ఫలితం 2024 లోక్‌సభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. 2019లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని కాంగ్రెస్‌కు 2024లో 99 సీట్లు తెచ్చి.. ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. పార్లమెంటులో కూడా ఆకట్టుకునే ప్రసంగం, ప్రశ్నలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ఇలాగే యాక్టివ్‌గా ఉంటే.. 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తాడని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అయితే ఆయనను ఇప్పుడు ఓ జర్నలిస్టు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. ఎక్స్‌ వేదికగా రాహుల్‌ రహస్యాలు బయట పెడుతున్నారు.

బంగ్లాదేశ్‌ జర్నలిస్టు..
బంగ్లాదేశ్‌కు చెందిన జర్నలిస్టు సలాహుద్దీన్‌ షాహిద్‌ చౌదరి అనే జర్నలిస్టు రాహుల్‌ రహస్యాలను ఒక్కొక్కటిగా సోషల్‌ మీడియా వేదికగా బయట పెడుతున్నారు. తాజాగా ఆయన ఎక్స్‌లో రాహుల్‌గాంధీ ఫొటో పోస్టు చేశాడు. అందులో ఆయన పక్కన ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ ఫొటోకు రాహుల్‌ ఈమె ఎవరో తెలియదా.. అని ప్రశ్నించారు. ఏం జరిగిందో తెలుసు కదా.. అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇది ఇప్పుడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయింది. సాక్షాధారాలతో జర్నలిస్టు రాహుల్‌గాంధీ రహస్యాలను బయటపెట్టడం కాంగ్రెసై పార్టీకి ఇబ్బందిగా మారింది. బీజేపీకి ఆయుధంగా మారింది.

రాహుల్‌ మౌనం..
ఇక సదరు జర్నలిస్టు వరుసగా రాహుల్‌ వ్యక్గిత విషయాలను బయటపెడుతుండడం.. రాహుల్‌ స్పందించకపోవడం మరింత చర్చకు దారితీస్తోంది. మౌనం అంగీకారమేనా అన్నట్లు విశ్లేషకులు అభి‘ప్రాయపడుతున్నారు. గతంలో రాజీవ్‌గాంధీ కూడా ఇటలీకి చెందిన సోనియాగాంధీని రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు రాహుల్‌ కూడా అలాగే చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర దేశాల యువతిని పెళ్లి చేసుకుని భారత్‌లో బ్రహ్మచారిగా వ్యవహరిస్తున్నాడా అన్న విమర్వలు వస్తున్నాయి. అయినా రాహుల్‌ మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం.

అమెరికాకు రాహుల్‌..
ఇదిలా ఉంటే రాహుల్‌ గాంధీ ఐదు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లున్నారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటనగా కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం జర్నలిస్టు పోస్టులు.. తాజాఆ రాహుల్‌ అమెరికా పర్యటన నేపథ్యంలో సెటైర్లు వేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. మరి రాహుల్‌ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.