Director Shankar : ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ స్టోరీ ని రెడీ చేస్తున్న శంకర్…ఇది వర్కౌట్ అవుతుందటరా..?

సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ మంచి కథ రాసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని తెర పైన చూపించడం కూడా అంతే ముఖ్యం... కొంచెం పొరపాటు జరిగిన డైరెక్టర్ విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ లో ఎలాగైనా సరే సక్సెస్ అనేది రావాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది...

Written By: Gopi, Updated On : September 1, 2024 2:11 pm

Aparchithudu sequel

Follow us on

Director Shankar :  తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళలో శంకర్ మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించాయి. ఇక తమిళం లోనే కాకుండా తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబడుతూ ఉంటాయి. ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన జెంటిల్ మెన్ సినిమా నుంచి మొన్న వచ్చిన భారతీయుడు 2 సినిమా వరకు కూడా ప్రతి మూవీలో ఆయనకున్న ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి ఆయన తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకొని పాన్ ఇండియాలో గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఆయన కెరియర్ లోనే బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన అపరిచితుడు సినిమాకి సీక్వెల్ ని కూడా ఆయన రెడీ చేసినట్టుగా సమాచారం అయితే అందుతుంది.

అయితే భారతీయుడుకు సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 సినిమా ఆశించిన మేరకు విజయాన్నైతే సాధించలేదు. కాబట్టి ఇప్పుడు అపరిచితుడు సినిమా సీక్వెల్ చేస్తే దాని పరిస్థితి ఏంటి ఇది కూడా భారతీయుడు 2 లాగే ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తుందా? అనవసరంగా ఆ సినిమాను చెడగొడతారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే ప్రస్తుతం శంకర్ అపరిచితుడు 2 సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక రామ్ చరణ్ ని గత మూడు సంవత్సరాల నుంచి ఆయన ఒక సినిమా కోసమే లాల్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఈ సినిమాను అద్భుతంగా తీసి అతనికి ఒక మంచి సక్సెస్ ఇస్తే పర్లేదు కానీ లేకపోతే మాత్రం ఇన్ని రోజుల నుంచి రామ్ చరణ్ ని ఇబ్బంది పెడుతూ ఫ్లాప్ సినిమా తీశాడు అంటూ శంకర్ చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కాబట్టి ఎలాగైనా సరే ఇప్పుడు తను భారీ సక్సెస్ ని కొట్టాలి లేకపోతే మాత్రం స్టార్ డైరెక్టర్లు మధ్య జరుగుతున్న పోటీలో శంకర్ అనేవాడు నిలబడటం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ సినిమాలను సక్సెస్ ఫుల్ సినిమా గా నిలిపే బాధ్యత కూడా తన మీదనే ఉంది…