Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ను ఓటు వేసి గెలిపించడం ఎలానో తెలుసా?

ఇలా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా వచ్చి ప్రస్తుతం బాగా సెటిల్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మరోపక్క హౌస్ లో తమ పర్ఫామెన్స్ తో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు.

Written By: Vadde, Updated On : September 14, 2023 10:27 am

Bigg Boss 7 Telugu Voting

Follow us on

Bigg Boss 7 Telugu Voting: ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా బుల్లితెర ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 గురించే డిస్కషన్ జరుగుతుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న అందరికంటే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ లు ఏర్పడుతున్నాయి. అప్పటివరకు నామమాత్రంగానే తెలిసిన వారు కూడా ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారంటే మంచి పాపులారిటీ తెచ్చుకోక మానరు.

ఇలా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా వచ్చి ప్రస్తుతం బాగా సెటిల్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మరోపక్క హౌస్ లో తమ పర్ఫామెన్స్ తో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయినప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ వాళ్లకు ఓటింగ్ పద్ధతి ద్వారా ఓట్లు వేసి సేఫ్ జోన్ లోకి తీసుకువెళ్తారు.

అలా సేఫ్ జోన్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ తిరిగి బిగ్ బాస్ హౌస్ లోనే కొనసాగుతారు. ఓటింగ్ తక్కువ ఉన్నవాళ్లు ఎలిమినేట్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ అందరూ తమ పెర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులలో ఫాలోవర్స్ ను ,ఫాన్స్ ను పెంచుకోవడానికి తెగ ఆరాటపడతారు. ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో మీకు నచ్చిన కంటెస్టెంట్‌కు ఓటు ఎలా వేయాలో తెలుసా?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 రియాలిటీ షోలో కంటెస్టెంట్‌కు రెండు పద్ధతులలో ఓటు వేయొచ్చు. మీకు డిస్నీ హాట్ స్టార్ యాప్ లో మెంబర్షిప్ ఉన్నట్లయితే.. మీరు ఆప్ ద్వారా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కు ఓటు వేయవచ్చు. అలాగే ప్రతి ఎపిసోడ్ చివరిలో ప్రతి కంటెస్టెంట్ కు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను డిస్ప్లే చేస్తారు. మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కు ఓటు వేయవచ్చు.

మీ దగ్గర డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌ లేనట్లయితే…ఇలా చేయండి.

మొదట మీ ఫోన్ లోని గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లోకి వెళ్లి…సర్చ్ బార్ లో డిస్నీ+హాట్ స్టార అని టైప్ చేస్తే యాప్‌ డిస్ప్లే అవుతుంది.
తర్వాత ఆ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఆప్ ను ఓపెన్ చేసి అందులో అకౌంట్ ని క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వండి.
యాప్‌ లో లాగిన్ అయిన తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అని సెర్చ్ చేయాలి.
ఇప్పుడు అందులో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసుకొని ఓటు వేయవచ్చు.
అయితే ప్రతి వారం కేవలం శుక్రవారం రాత్రి 11 : 59 నిమిషాల వరకు మాత్రమే ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది.

ఇక టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయాలి అనుకునే వారికి ప్రతి కంటెస్టెంట్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి…

అమర్ దీప్ 8886676901
సింగర్ దామిని భాట్ల 8886676902
డాక్టర్ గౌతమ్ కృష్ణ 8886676903
పల్లవి ప్రశాంత్ 8886676905
ప్రిన్స్ యావర్ 8886676906
ప్రియాంక జైన్ 8886676907
రతికా రోజ్ 8886676908
ఆట సందీప్ 8886676909
షకీలా 8886676910
శోభా శెట్టి 8886676911
యాక్టర్ శివాజీ 8886676912
శుభ శ్రీ 8886676913
టేస్టీ తేజా 8886676914