Uber Helicopter: అమెరికాలో ఎయిర్‌ మొబిలిటీ.. నెటిజన్లతో పంచుకున్న భారత సంతతి మహిళ

క్లీనర్‌ పెర్కిన్స్‌లో ఉద్యోగి అయిన ఖుషీ సూరి మాన్‌హటన్‌ నుంచి క్వీన్ల్‌ని జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాలనుకుంది. ఇందుకు ఉబెర్‌ వెళ్లాలని ప్రయత్నించింది. ఉబెర్‌లో వెళితే 60 నిమిషాల సమయం పడుతుందని గుర్తించింది.

Written By: Raj Shekar, Updated On : June 21, 2024 6:02 pm

Uber Helicopter

Follow us on

Uber Helicopter: ట్రాఫిక్‌ సమస్య అంటే.. కేవలం ఇండియాలోనే ఉంటుందని చాలా మంది అనుకుంటారు. అమెరికాలాంటి దేశాల్లో రోడ్లు విశాలంగా ఉంటాయని, ఎలాంటి ట్రాఫిక్‌ సమస్య ఉండదని భావిస్తారు. కానీ, వాస్తవం అక్కడి వారికే తెలుస్తుంది. అమెరికాలో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు ఇండో అమెరికన్‌ మహిళ చేసిన పని ఇప్పుడు వార్తల్లో నిలిచింది. న్యూయార్క్‌ సిటీలో ట్రాఫిక్‌ సమస్య అధిగమించడానికి ఉబెర్‌ ట్రిప్‌లో కాకుండా తెలివిగా హెలిక్యాప్టర్‌ రైడ్‌ను ఎంచుకుంది. ఇందుకు అయిన ఖర్చు కూడా పెద్దగా లేకపోవడంతో తెలివిగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వివరాలను ఎక్స్‌ పోస్ట్‌ చేయగా ఇది వైరల్‌ గా మారింది.

ఏం జరిగిందంటే..
క్లీనర్‌ పెర్కిన్స్‌లో ఉద్యోగి అయిన ఖుషీ సూరి మాన్‌హటన్‌ నుంచి క్వీన్ల్‌ని జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాలనుకుంది. ఇందుకు ఉబెర్‌ వెళ్లాలని ప్రయత్నించింది. ఉబెర్‌లో వెళితే 60 నిమిషాల సమయం పడుతుందని గుర్తించింది. అమ్మో… అంత టైమా అనుకుని హెలికాప్టర్‌ రైడ్ కి ఎంత సమయం పడుతుందా అని ఒకసారి చెక్‌ చేసింది. కేవలం 5 నిమిషాల్లో వెళ్లిపోవచ్చని చూపించింది. పైగా ఈరెండింటి మధ్య ఖర్చుకు పెద్ద తేడాలేదు. కేవలం 30 డాలర్లు మాత్రమే డిఫరెన్స్‌ చూపించింది. అంతే క్షణం ఆలస్యం చేయకుండా హెలికాఫ్టర్‌ బుక్‌ చేసుకుంది.

ఎక్స్‌లో పోస్టు..
ధరల స్క్రీన్‌షాట్లతోపాటు బ్లేడ్‌ ఎయిర్‌ మొబిలిటీని ట్యాగ్‌ చేసింది ఖుషీ సూరి. ఎక్స్‌లో ఆమె షేర్‌ చేసిన స్క్రీన్‌షాట్‌ ప్రకారం.. ఉబెర్‌ క్యాబ్‌ ఖర్చు రూ.11,000. సమయం 60 నిమిషాలు. అదే బ్లేడ్‌ హెలికాఫ్టర్‌ రైడ్‌కు 5 నిమిషాలు. పైగా ఖర్చు సుమారు రూ.13,765. దీంతో ఆమె ఎచక్కా హెలికాఫ్టర్‌ ఎంచుకుంది. దీంతో ట్రాఫిక్‌ గందరగోళాన్ని తప్పించుకోవడంతోపాటు, హెలికాప్టర్‌ రైడ్‌ను ఎంజాయ్‌ చేయవచ్చన్నది ఆమె ప్లాన్‌. దీంతో నెటిజనులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. జూన్‌ 17న షేర్‌ అయిన ఈ వీడియోను 40.3 లక్షల మందికి పైగా వీక్షించారు.

ఎయిర్‌ మొబిలిటీ..
అగ్రరాజ్యం అమెరికాలో పేరుకు తగినట్లుగా కార్లతోపాటు ఎయిర్‌ మొబిలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. న్యూయార్క్‌ నగరంలో ఉన్న బ్లేడ్‌ ఎయిర్‌ హెలిక్యాప్టర్ల ద్వారా ఇలా మొబిలిటీ సేవలు అందిస్తోంది. ప్రధానంగా మాన్‌హాటన్‌ – జాన్‌ ఎఫ్‌.కెన్నెడీ విమానాశ్రయాల మధ్య ఈ సేవలు అందిస్తోంది.