Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ను ఇప్పుడు ఓటీటీ వేదికగా అందిస్తోంది. మొదటి నుంచి ఈ షో విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో కంటే చాలా మసాలా పండుతోంది. కంటెస్టెంట్స్ మధ్య దారుణమైన బూతులు, గొడవలతో నిత్యం రచ్చరచ్చగా సాగుతోంది. గతంలో కంటే ఎవరూ ఊహించని విధంగా ఈసారి టాస్క్ లు ఉంటున్నాయి. నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఐదో వారం ఆసక్తికరంగా సాగుతోంది.

17 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఇప్పటికే నాలుగు వారాల్లో ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, ఆర్జే చైతు, సరయు ఎలిమినేట్ అయిపోయారు. అయితే 5వ వారం నామినేషన్ టాస్క్ చాలా గొడవలతో సాగింది. బిగ్ బాస్ షో లో అన్నిటికంటే నామినేషన్ టాస్కేచాలా టఫ్ గా ఉంటుంది. పైగా ఐదో వారం స్వైప్ చేసుకునే ఆప్షన్ కూడా బిగ్ బాస్ ఇవ్వడంతో పెద్ద రాద్ధాంతమే జరిగింది.
స్వైప్ చేసుకునే ఆప్షన్ ను వినియోగించుకుని అషు రెడ్డి, మహేష్ విట్టా సేఫ్ అయిపోయారు. కాగా ఈ స్వైప్ ఆప్షన్ లో.. బిందు మాధవి, స్రవంతి బలైపోయారు. 5వ వారం ఎలిమినేషన్ కు సంబంధించి ఓటింగ్ ఈ విధంగా జరుగుతోంది. మొదటినుంచి టైటిల్ ఫేవరెట్ గా ఉన్న బిందు మాధవి ఓటింగ్ లో టాప్ లో ఉంది. ఆమె తర్వాత యాంకర్ శివ, తేజస్వి, అరియాన, మిత్రశర్మలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆరో ప్లేస్ లో అనిల్ రాథోడ్ ఉండగా.. ఏడో ప్లేస్ లో యాంకర్ స్రవంతి ఉన్నారు.

చూస్తుంటే ఈ వారం స్రవంతి ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇందుకు కారణం అఖిల్ బ్యాచ్ తో గ్యాప్ రావడం వల్లే ఓటింగ్ తగ్గిందని అంటున్నారు. కానీ బిగ్ బాస్ షో లో చివరి వరకు ఏం జరిగేది ఎవరికీ తెలియదు. ఒకవేళ స్రవంతి ఎలిమినేట్ అయితే మాత్రం అఖిల్ బ్యాచ్ నుంచి మరొకరు వెళ్లిపోయినట్లు అవుతుంది.