spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: భరించలేని అతితో చిరాకు పుట్టించిన విష్ణు ప్రియ..నాగార్జున తో ఎలా...

Bigg Boss Telugu 8: భరించలేని అతితో చిరాకు పుట్టించిన విష్ణు ప్రియ..నాగార్జున తో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా?

Bigg Boss Telugu 8 : హోస్ట్ గా ఈ సీజన్ లో అక్కినేని నాగార్జున కొంతమంది కంటెస్టెంట్స్ విషయం లో వివక్ష చూపిస్తున్నట్టుగా అనిపించింది. మణికంఠ సరిగా ఆడడం లేదని, అతన్ని మళ్ళీ ట్రాక్ లో పెట్టేందుకు నాగార్జున గత వీకెండ్ ఎపిసోడ్ లో ఎలాంటి క్లాస్ పీకుతాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ దెబ్బకి ఆయనలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. మరుసటి వారంలో తన ఆట తీరు మొత్తాన్ని మార్చేసుకున్నాడు. కానీ విష్ణు ప్రియ విషయం లో నాగార్జున ఎందుకు అలా చేయడం లేదు అని అనేక మంది ప్రేక్షకుల్లో కలిగిన సందేహం. ప్రతీ వీకెండ్ ఎపిసోడ్ లో ఆమెతో మాట్లాడినప్పుడల్లా నాగార్జున ఒక చిన్న పిల్లతో మాట్లాడినట్టు మాట్లాడుతాడు. ఆమె వైపు నుండి కూడా అలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి.

ఒక్క ఎపిసోడ్ లో కూడా ఇప్పటి వరకు ఆమె సీరియస్ గా టాస్కులు ఆడినట్టు లోపల ఉన్నటువంటి హౌస్ మేట్స్ చూడలేదు, అలాగే బయట ప్రేక్షకులు కూడా చూడలేదు. ఈ విషయం లో నాగార్జున ఆమెకి ఫుల్ కోటింగ్ ఇచ్చి, గేమ్ లోకి ఆమెని తీసుకొస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ పని చేయడం లేదు. నిన్నటి ఎపిసోడ్ లో అయితే ఆమె గారాలు పడడాన్ని చూసి ప్రేక్షకులకు చిరాకు కలిగింది. పృథ్వీ, విష్ణు ప్రియ మధ్య నడుస్తున్న లవ్ ట్రాక్ ని నాగార్జున ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ లవ్ ట్రాక్ కారణంగా విష్ణు ప్రియకి గేమ్ ఆడడం లో కసి ఉండడం లేదు, ఈమె ఆటని చెడగొట్టుకోవడమే కాకుండా, పృథ్వీ ఆటను కూడా తగ్గించేస్తుంది. ఇది చూసే ప్రతీ ఒక్కరికి అర్థం అవుతూనే ఉంది, నాగార్జున కి కూడా తెలుసు, కానీ ఎందుకు బ్రేక్ చేయడం లేదో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పైగా ఈ వారం లో ఆమె చెయ్యి కట్ అయ్యినప్పుడు పృథ్వీ ఫస్ట్ ఎయిడ్ కోసం గౌతమ్ వద్దకు తీసుకొని రావడం, గౌతమ్ ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అతనికి కనీసం థాంక్స్ కూడా చెప్పకుండా, తన మీద శ్రద్ద చూపించినందుకు పృథ్వీ ని ముద్దు పెట్టుకోవడం వంటివి చేసింది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే రియాలిటీ షో, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆపాల్సిన బాధ్యత హోస్ట్ గా నాగార్జునదే కదా, కానీ ఆయన ఆ పని చేయడం లేదు. నిజం చెప్పాలంటే ఈ వారం హోటల్ టాస్క్ లో విష్ణు ప్రియ చేసిందేమి లేదు. ఒక్క టాస్క్ ని కూడా ఆమె బలంగా ఆడలేకపోయింది, ఇక ఎంటర్టైన్మెంట్ విషయం లో అయితే దరిదాపుల్లో కూడా లేదు. నాగార్జున ఆమెతో మాట్లాడుతూ ‘నువ్వు ఇలాగే గేమ్స్ ఆడితే ఆడియన్స్ నిన్ను సీరియస్ గా తీసుకోవడం మానేస్తారు, ఇంటికి పంపుతారు’ అని చాలా సున్నితంగా అంటాడు. వచ్చే వారం ఫాలింగ్ స్టార్స్ నుండి రైజింగ్ స్టార్స్ లోకి వచ్చేయాలి అని అంటాడు, దానికి విష్ణు ప్రియ కచ్చితంగా వస్తాను సార్ అని కామెడీ గా చెప్పి కూర్చుంటుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...

Tech Mahindra Employee: ఐటీ ఉద్యోగం అంటేనే పేక మేడ.. ఎప్పుడు ఊడుతుందో ఎవరికి ఎరుక.. పాపం ఈ...

Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు...
Oktelugu Epaper
Exit mobile version