https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ప్రేరణ తెలివితేటలకు దండం పెట్టేసిన నాగార్జున..ఈ దెబ్బతో టైటిల్ రేస్ లోకి వచ్చేసినట్టే!

ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే కచ్చితంగా టైటిల్ రేస్ లోకి వస్తుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది, తన ఆట తీరుతో టైటిల్ రేసులోకి కూడా వచ్చేసింది అని చెప్పొచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : October 13, 2024 / 08:31 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో మొదటి వారం నుండి టాస్కులు పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా ది బెస్ట్ అనిపించుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరు ప్రేరణ. ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈమె, స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాల్గొంటూ తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది. అయితే బిగ్ బాస్ సీజన్ ప్రారంభం అయ్యే ముందు స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ అనే గేమ్ షో లో పాల్గొన్న ప్రేరణ, టాస్కులలో మగవాళ్ళతో సమానంగా ఆడిన తీరుని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే కచ్చితంగా టైటిల్ రేస్ లోకి వస్తుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది, తన ఆట తీరుతో టైటిల్ రేసులోకి కూడా వచ్చేసింది అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ వారం టాస్కులు ఆడే విషయం లో ప్రేరణ కాస్త వెనుకబడింది అని చెప్పొచ్చు. అది కేవలం మెగా చీఫ్ నభీల్ కారణంగా అనేది ఆమె అభిప్రాయం. ఈ విషయంలో ఆమె నభీల్ తో మాట్లాడి చిన్నపాటి గొడవ కూడా పెట్టుకుంది.

    ఈ గొడవ నభీల్ గ్రాఫ్ ని బాగా తగ్గించేసింది. కారణం తప్పు ఆయన వైపే ఉంది కాబట్టి. ప్రేరణ మీద కోపం తో ఆమె వెనుక చేరి ఎన్నో మాటలు మాట్లాడాడు. అంతే కాకుండా ప్రేరణ ని టాస్కులు ఆడనివ్వకుండా చాలా వరకు తొక్కే ప్రయత్నం చేసాడు. దీనిపై ప్రేరణ అతన్ని పిలిచి మాట్లాడుతూ ‘అసలు ఏమైంది నీకు..ఎందుకు నన్ను దూరం పెడుతున్నావ్?, మంచి స్నేహితులం అయ్యాము కదా, మెగా చీఫ్ అయ్యాక మారిపోయావు, నన్ను టాస్కులు కూడా ఆడనివ్వలేదు’ అని ముఖం మీదనే అడిగేస్తుంది. ఆ తర్వాత అతను ఇచ్చే సమాదానాలు కారణంగా నాకు నువ్వు మెచ్యూరిటీ లేని వాడిగా అనిపించావు అని అంటుంది. అయితే హౌస్ లో నిన్న నాగార్జున కంటెస్టెంట్స్ కి ‘రైజింగ్ స్టార్స్’, ‘ఫాలింగ్ స్టార్స్’ అనే టైటిల్స్ ఇచ్చాడు. ప్రేరణ వంతు వచ్చినప్పుడు నాగార్జున ‘ఫాలింగ్ స్టార్స్’ వైపు పెట్టబోతుంటే, ప్రేరణ ‘సార్, ప్లీజ్ మధ్యలో పెట్టండి’ అని అంటుంది.

    అప్పుడు నాగార్జున నవ్వుతూ ఆమె ఫోటోని మధ్యలో పెడుతాడు. ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతూ ‘నీకు మైండ్ రీడింగ్ కూడా తెలుసా..?, నేను మధ్యలోనే పెట్టబోతూ ఉన్నాను’ అని అంటాడు. ఎందుకో కారణాలు చెప్పమని ప్రేరణని అడగమనగా ‘నేను మతిమరపు ఉన్న మ్యానేజర్ గా ఏమి చెయ్యాలో అవన్నీ చేశాను. కానీ మధ్యలో స్టాఫ్ నా మాటలను ఎందుకో సరిగా లెక్క చేయలేదు అనిపించింది. అందుకే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ని ఇవ్వలేకపోయాను,టాస్కులు కూడా పెద్దగా ఆడలేదు, కానీ చివరి వాటర్ ట్యాంక్ టాస్కులో మాత్రం బాగా ఆడాను, అందుకే మధ్యలో పెట్టమని చెప్పాను సార్’ అని అంటుంది ప్రేరణ. ఆమె తెలివితేటలు, తప్పు చేస్తే ఒప్పుకునే గుణం వంటివి చూసి టైటిల్ రేస్ లోకి అడుగుపెట్టేందుకు అర్హతలు ఉన్న కంటెస్టెంట్, ఈ ఎపిసోడ్ తో టైటిల్ రేస్ లోకి వచ్చేసినట్టే అని విశ్లేషకులు అంటున్నారు.