https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నభీల్ మెచ్యూరిటీ లేని వాడని ఆధారాలతో సహా నిరూపించిన నాగార్జున..దెబ్బకి మాట పడిపోయిందిగా!

నభీల్ కారణంగానే హోటల్ టాస్క్ లో ఓజీ క్లాన్ ఓడిపోవాల్సి వచ్చింది. అదంతా పక్కన పెడితే నభీల్ తన పట్ల వ్యవహరించిన తీరుపై ప్రేరణ నీలో మెచ్యూరిటీ రాలేదు, చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తిస్తున్నావు అని అంటుంది.దీనికి నభీల్ నేను మెచ్యూరిటీ లేని వాడిని కాదు అంటూ పెద్దగా అరిచి మాట్లాడుతాడు. ఈ విషయం పై నాగార్జున కూడా చర్చిస్తాడు

Written By:
  • Vicky
  • , Updated On : October 13, 2024 / 08:47 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ప్రేరణ, నభీల్ మధ్య జరిగిన చిన్నపాటి గొడవ సోషల్ మీడియా లో పెద్ద చర్చనీయాంశం అయిన సంగతి అందరికీ తెలిసిందే. నభీల్ ని ప్రేరణ తన స్నేహితుడిగా భావించింది. కానీ నభీల్ కి ఎందుకో ప్రేరణ అంటే అసూయ, కోపం ఉన్నట్టుగా ఈ వారం జరిగిన ఎపిసోడ్స్ మొత్తం చూసిన తర్వాత ఆడియన్స్ కి అనిపించింది. ఎందుకంటే మెగా చీఫ్ గా నభీల్ ప్రేరణ ని అసలు పట్టించుకోలేదు. ప్రతీ చిన్న నిర్ణయం తీసుకునే ముందు ఆయన సీత ని అడగడం, సీత మాటలకు ప్రభావితం అవ్వడం వంటివి చేసేవాడు. ఒక చీఫ్ గా ఎక్కడైతే సరైన నిర్ణయాలు తీసుకోవాలో, అక్కడ ఆయన తీసుకోలేకపోయాడు. సందర్భాలకు తగ్గట్టుగా ఆయన గేమ్ ఆడలేదు. చీఫ్ గా ఒక్క మాటలో చెప్పాలంటే డిజాస్టర్ అనే చెప్పాలి. కేవలం నభీల్ కారణంగానే హోటల్ టాస్క్ లో ఓజీ క్లాన్ ఓడిపోవాల్సి వచ్చింది. అదంతా పక్కన పెడితే నభీల్ తన పట్ల వ్యవహరించిన తీరుపై ప్రేరణ నీలో మెచ్యూరిటీ రాలేదు, చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తిస్తున్నావు అని అంటుంది.

    దీనికి నభీల్ నేను మెచ్యూరిటీ లేని వాడిని కాదు అంటూ పెద్దగా అరిచి మాట్లాడుతాడు. ఈ విషయం పై నాగార్జున కూడా చర్చిస్తాడు. నాగార్జున తన అభిప్రాయం నభీల్ తో చెప్తూ ‘ప్రేరణ కి నీతో సమస్య ఏర్పడింది. ఆ సమస్య గురించి ఆమె నేరుగా నీతోనే మాట్లాడింది కానీ, బయట ఎవరితో మాట్లాడలేదు. అది ఆమె చూపించిన మెచ్యూరిటీ. కానీ నువ్వు మాత్రం ఆమెతో తప్ప, ఆమెతో నీకు ఉన్నటువంటి సమస్య గురించి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడావు. చివరికి రాయల్ క్లాన్ సభ్యుల దగ్గరకి కూడా వెళ్లి ప్రేరణ గురించి మాట్లాడావు. ఇదే మెచ్యూరిటీ లేని తత్త్వం అంటే’ అని నాగార్జున వివరిస్తాడు. దీంతో నభీల్ మాటలు దెబ్బకి పడిపోయాయి, ఎందుకంటే అతను చేసిన తప్పేంటో అతనికి అర్థం అయిపోయింది.

    ఇదంతా పక్కన పెడితే రాయల్ క్లాన్ సభ్యులు డబ్బులు చెల్లించకుండా గులాబీ జాన్స్ తినేస్తారు. ఆ తర్వాత సీత వాళ్ళ నుండి డబ్బులు కొట్టేస్తుంది. ఇక్కడ ఇరు క్లాన్ కి చెందిన సభ్యులు న్యాయంగా వ్యవహరించలేదు. కాబట్టి సీత డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నభీల్ ఆమెతో ఇచ్చేయమని చెప్తాడు. నాగార్జున సార్ ఒకవేళ తప్పుబడితే దానికి నేనే కారణం అని నా మీద వేసుకుంటా అని ఆమె చెప్పినా కూడా నభీల్ ‘మెగా చీఫ్ అయ్యినందుకు నాగార్జున సార్ నన్నే అడుగుతాడు..నేను రిస్క్ తీసుకోలేను, తిరిగి ఇచ్చేయ్’ అని అంటాడు. నభీల్ గోల తట్టుకోలేక సీత హరితేజ వద్ద కొట్టేసిన డబ్బులను తిరిగి ఇచ్చేస్తుంది. ఆమె తిరిగి ఇవ్వడం వల్ల డబ్బులు తక్కువ ఉన్నందున ఓజీ క్లాన్ టాస్కు ఓడిపోతుంది. అందుకు కారణం నభీల్, ఈ విషయంలో కూడా ఆయనకీ నాగార్జున చేతిలో చివాట్లు పడ్డాయి. ఇలా ఈ వారం మొత్తం నభీల్ తన మాస్కు ని తొలగించి, అసలు రూపం చూపించి గ్రాఫ్ ని తగ్గించేసుకున్నాడు. ఈ వారం కూడా ఆయన నామినేషన్స్ లో ప్రేరణ ని టార్గెట్ చేస్తే ఇక టైటిల్ రేస్ నుండి తప్పుకున్నట్టే అని చెప్పాలి.