Bigg Boss 7 Telugu: ఆదివారం ఎపిసోడ్లో రతికా రోజ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక సోమవారం ఏం జరిగిందో చూద్దాం. పవర్ అస్త్ర కోల్పోయిన శివాజీ లగ్జరీలు కోల్పోయాడు. అతడు వీఐపీ రూమ్ నుండి బయటకు వచ్చేశాడు. డీలక్స్ రూమ్ కి షిఫ్ట్ అయ్యాడు. అనంతరం బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టాడు. గార్డెన్ ఏరియాలోకి కంటెస్టెంట్స్ ని పిలిచిన బిగ్ బాస్… ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలని అన్నాడు.
మెడలో ప్రతి కంటెస్టెంట్ హౌస్ మేట్ అని రాసున్న బోర్డు తగిలించుకోవాలి. తగు కారణాలు చెప్పి నామినేట్ చేసిన కంటెస్టెంట్ మెడలో ఉన్న బోర్డుపై కత్తి గుచ్చాలి. గత నామినేషన్స్ తో పోల్చుకుంటే కొంచెం సాఫీగానే నామినేషన్స్ ప్రక్రియ సాగింది. పెద్దగా గొడవలు జరగలేదు. ఇక ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే… శివాజీ- అమర్ దీప్, ప్రియాంకలను చేశాడు. ప్రియాంక-శివాజీ, యావర్ లను చేసింది. గౌతమ్-అమర్ దీప్, శివాజీలను చేశాడు. శుభశ్రీ- అమర్ దీప్, ప్రియాంకలను చేసింది.
యావర్ కూడా అమర్ దీప్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. అమర్ దీప్- శుభశ్రీ, శివాజీలను చేశాడు. ఇక తేజ- యావర్, గౌతమ్ లను చేశాడు. అత్యధికంగా అమర్ దీప్ ని నలుగురు నామినేట్ చేశారు. అనంతరం అమర్ దీప్, ప్రియాంక, యావర్, గౌతమ్, శుభశ్రీ, శివాజీ, తేజా నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.
శివాజీ తన పవర్ అస్త్ర రద్దు చేయడంపై అసహనం వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ మొండి ఆడుతున్నాడని అన్నాడు. తాను టైటిల్ కోసం రాలేదు, జనాలను ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను అన్నాడు. నా లగ్జరీలు అన్ని కట్ చేశారు. కనీసం కాఫీ కూడా ఇవ్వడం లేదు. నేను వెళ్ళిపోతా అంటూ… ఎప్పటి రాగమే అందుకున్నాడు. ఈ క్రమంలో శివాజీ సీరియల్ బ్యాచ్ మీద కూడా ఆరోపణలు చేశాడు.
ఇక 5వ పవర్ అస్త్ర ఎవరి దక్కుతుందనే ఉత్కంఠ మధ్య బిగ్ బాస్ కీలక ప్రకటన చేశాడు. ఇప్పటి వరకు పవర్ అస్త్ర కోసం కంటెస్టెంట్స్ కష్టపడ్డారు. ఇకపై ప్రేక్షకులు నిర్ణయిస్తాడు అన్నాడు. అంటే ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా నెక్స్ట్ పవర్ అస్త్ర ఓ కంటెస్టెంట్ కి దక్కే అవకాశం ఉంది. ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్ర గెలిచిన వారి లిస్ట్ లో ఉన్నారు. శివాజీ దాన్ని కోల్పోయాడు.