Bigg Boss 6 Telugu Inaya Sultana: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 సందడి మొదలైంది. అందరూ రాత్రి 10 కాగానే టీవీలకు అతుక్కుపోతున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఈసారి 21 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో గోలగోల మొదలైంది. తొలి రోజు నుంచే గొడవలు, కొట్లాటలు, టాస్కులతో రంజుగా సాగుతోంది. అయితే షో చూసిన వారందరికీ బిగ్ బాస్ టీం ఒకరిని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.
బిగ్ బాస్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇనాయా సుల్తానా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అమ్మడు అప్పట్లో రాంగోపాల్ వర్మతో కలిసి చేసిన రోమాన్స్ వీడియోలతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వచ్చాక అందరితో గొడవలు పెట్టుకుంటూ తండ్రి సెంటిమెంట్ ను రాజేస్తూ ఏడుస్తూ ఫోకస్ అవుతోంది. అందరి కంటే వివాదాస్పద లేడీగా ముద్ర పడిపోయింది. ఫలితంగా ఇనాయా హైలెట్ అవుతోంది.
Also Read: Ram Gopal Varma Climax: బూతు సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా వదిలిన వర్మ… ఎగబడి చూస్తున్న జనాలు
బిగ్ బాస్ ప్రారంభమైనప్పటి నుంచి గొడవలు పెట్టుకుంటున్న ఇనాయా సుల్తానానే బిగ్ బాస్ టీం టార్గెట్ చేసింది. మొదట గీతూతో ఇనాయా లొల్లిపెట్టుకుంది. అనంతరం ఆదిరెడ్డితో వాగ్వాదానికి దిగింది. తనకు ఎవరూ సపోర్టు చేయడం లేదని ఇంట్లో గోలగోల చేసి ఏడ్చేసింది. తోటి కంటెస్టెంట్లపై విరుచుకుపడింది.
గీతూను ఎంటర్ టైన్ మెంట్ యాంగిల్ లో చూపిస్తున్న బిగ్ బాస్ టీం.. ఇనాయాను మాత్రం వివాదాస్పద గొడవలు పెట్టుకునే అమ్మాయిగా ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఆమెను బయటకు పంపే కుట్ర చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ తొలి వారం హౌస్ నుంచి వెళ్లిపోయేది ఆమెనంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ టీం ఆమెను వివాదాస్పదరాలిగా చూపిస్తూ బయటకు పంపేలా ఫోకస్ చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.