Ram Gopal Varma Climax: రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. తాజాగా ఈ వివాదాస్పద డైరెక్టర్ అడల్ట్ కంటెంట్ మూవీ యూట్యూబ్ లో విడుదల చేశాడు. దీంతో జనాలు ఎగబడి చూస్తున్నారు. 2020లో వర్మ ‘క్లైమాక్స్’ టైటిల్ తో అడల్ట్ కంటెంట్ మూవీ తెరకెక్కించాడు. అమెరికన్ నటి మియా మాల్కోవా ప్రధాన పాత్రలో రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా క్లైమాక్స్ తెరకెక్కింది. నిర్జన ఎడారిలోకి ఏకాంతం కోసం వెళ్లిన ఓ జంట అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటారు. స్థానిక డేంజరస్ గ్రూప్ వాళ్లపై అటాక్ చేస్తారు. పదుల సంఖ్యలో ఉన్న ఆ గ్యాంగ్ నుండి ఆ జంట ఎలా తప్పించుకున్నారనేది కథ.
అప్పట్లో క్లైమాక్స్ ట్రైలర్ బాగా ఆకర్షించింది. మూవీపై హైప్ ఏర్పడిన నేపథ్యంలో వర్మ డిమాండ్ ని క్యాష్ చేసుకున్నారు. తన ఓన్ వెబ్ పోర్టల్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో క్లైమాక్స్ పే ఫర్ వ్యూ విధానంలో విడుదల చేశాడు. ప్రైస్ రెండు వందలకు పైగా ఫిక్స్ చేశాడు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి మంచిగా లాభాలు ఆర్జించాడు. ఆ చిత్రాన్ని రెండేళ్ల తర్వాత యూట్యూబ్ లో అందుబాటులోకి తెచ్చాడు.
సెప్టెంబర్ 3వ తేదీ నుండి క్లైమాక్స్ ఆర్జీవీ యూట్యూబ్ ఛానల్ లో ఫ్రీగా చూసే వెసులుబాటు కల్పించాడు. ఈ చిత్రానికి యూట్యూబ్ లో కూడా బాగానే రెస్పాన్స్ దక్కుతుంది. ఇప్పటి వరకు మూడు లక్షకు పైగా వ్యూస్ క్లైమాక్స్ చిత్రానికి దక్కాయి. రెస్పాన్స్ మెల్లగా పెరుగుతూ పోతుంది. యూట్యూబ్ ద్వారా కూడా వర్మ డబ్బులు ఆర్జించే ప్రయత్నం చేస్తున్నారు. మరి వర్మ బూతు మూవీ వన్ మిలియన్ మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటుందో లేదో చూడాలి.
కొన్నాళ్లుగా వర్మ అడల్ట్ కంటెంట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. రెండేళ్ల కాలంలో బ్యూటిఫుల్, క్లైమాక్స్, థ్రిల్లర్, నగ్నం, డేంజరస్ వంటి అడల్ట్ కంటెంట్ చిత్రాలు వర్మ తెరకెక్కించారు. ఇక జి ఎస్ టి సినిమాతో వర్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఆయన గాడ్ సెక్స్ ట్రూత్ టైటిల్ తో పూర్తి నగ్న చిత్రం వర్మ చేశారు. ఈ మూవీపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. మహిళా సంఘాలు వర్మను దుమ్మెత్తిపోశాయి. అనేక టీవీ డిబేట్స్ లో కూర్చున్న వర్మ ఐ డోంట్ కేర్ అంటూ విమర్శలు కొట్టిపారేశారు.
ఇక వర్మ లేటెస్ట్ మూవీ ‘అమ్మాయి’ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అమ్మాయి చిత్రం చైనాలో కూడా విడుదల చేస్తారు. వర్మ గత చిత్రాల మాదిరే ఇది కూడా నిరాశపరిచింది. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నా మూవీలో కథ, ఎమోషన్స్ మిస్ కావడంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు.
Also Read:Ravi Prakash- Ambani Telugu Channels: అంబానీల తెలుగు ఛానెల్ హెడ్ గా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్?