https://oktelugu.com/

Different Fathers : కవలలు… తల్లి ఒకరే గానీ, తండ్రులు వేరు. ; ఈ వింత ఎలా సాధ్యమైంది!

Different Fathers : 19 ఏళ్ల బ్రెజిలియన్ మహిళ ఇద్దరు వేర్వేరు తండ్రుల నుంచి కవలలకు జన్మనిచ్చింది. ఒకే రోజు ఇద్దరు పురుషులతో సంభోగంలో పాల్గొన్నానని ఆ మహిళ తెలిపింది. ఆమె వైద్యుడు దీనిపై వివరణ ఇచ్చాడు. “ఒకే తల్లి నుండి రెండు అండాలు తీసి వేర్వేరు పురుషుల శుక్రకణాలతో ఫలదీకరణం చేయబడినప్పుడు ఇది సాధ్యమవుతుంది. పిల్లలు తల్లి యొక్క జన్యు పదార్థాన్ని పంచుకుంటారు, కానీ అవి వేర్వేరు మావిలో పెరుగుతాయి.” అని వివరించారు. బ్రెజిల్‌ దేశంలోని […]

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2022 / 07:11 PM IST
    Follow us on

    Different Fathers : 19 ఏళ్ల బ్రెజిలియన్ మహిళ ఇద్దరు వేర్వేరు తండ్రుల నుంచి కవలలకు జన్మనిచ్చింది. ఒకే రోజు ఇద్దరు పురుషులతో సంభోగంలో పాల్గొన్నానని ఆ మహిళ తెలిపింది. ఆమె వైద్యుడు దీనిపై వివరణ ఇచ్చాడు. “ఒకే తల్లి నుండి రెండు అండాలు తీసి వేర్వేరు పురుషుల శుక్రకణాలతో ఫలదీకరణం చేయబడినప్పుడు ఇది సాధ్యమవుతుంది. పిల్లలు తల్లి యొక్క జన్యు పదార్థాన్ని పంచుకుంటారు, కానీ అవి వేర్వేరు మావిలో పెరుగుతాయి.” అని వివరించారు.

    బ్రెజిల్‌ దేశంలోని గోయాస్‌లో గల మినేరియోస్‌కు చెందిన 19 ఏళ్ల యువతి ఇద్దరు వేర్వేరు తండ్రుల నుండి కవలలకు జన్మనిచ్చింది. ఇది ‘మిలియన్‌లో వన్-ఇన్-ఎ-మిలియన్’గా పిలువబడే సూపర్ అరుదైన భావనగా పేర్కొంది. కానీ డాక్టర్లు మాత్రం ఇది చూసి అవాక్కయ్యారు. ఒకే రోజు ఇద్దరు పురుషులతో మహిళ శృంగారంలో పాల్గొందట.. అలా ఇద్దరు కవలలు ఇద్దరికీ పుట్టారని చెబుతోంది.

    కవలల తండ్రి ఎవరనే సందేహంతో ఆమె తన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి పితృత్వ పరీక్షను నిర్వహించిందని మీడియా నివేదించింది. తాను తండ్రిగా భావించిన వ్యక్తి నుండి డీఎన్ఏ పరీక్షలో ఒక శిశువుకు మాత్రమే అతడికి పుట్టాడని తేలడంతో తాను ఆశ్చర్యపోయానని యువతి తల్లి చెప్పింది.

    “నేను వేరొక వ్యక్తితో లైంగిక సంబంధం కలిగి ఉన్నాను. డీఎన్ఏ పరీక్షలో తన కవలలు ఎవరి బిడ్డనో తేల్చడానికి అతనిని పిలిచాను. అందులో ఒక బిడ్డమాత్రమే అతడి కొడుకు అని తేలింది. మరో బిడ్డ కాదని తేలింది. ఈ ఫలితాలతో నేను ఆశ్చర్యపోయాను. ఇది జరుగుతుందని నాకు తెలియదు. పిల్లలు చాలా పోలికలు కలిగి ఉన్నారు” అని ఆమె స్థానిక మీడియాతో అన్నారు.

    ఈ విషయం చాలా అరుదుగా ఉన్నప్పటికీ.. ఇది పూర్తిగా అసాధ్యం కాదు. శాస్త్రీయంగా దీనిని హెటెరోపరెంటల్ సూపర్‌ఫెకండేషన్ అని పిలుస్తారని వైద్యులు తెలిపారు. నివేదికల ప్రకారం.. ప్రపంచంలో కేవలం 20 ఇతర హెటెరోపేరెంటల్ సూపర్‌ఫెకండేషన్ కేసులు మాత్రమే ఉన్నాయి.

    శిశువులకు ఇప్పుడు 16 నెలల వయస్సు ఉందని, తండ్రులలో ఒకరు వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారని యువతి తల్లి చెప్పారు. వాళ్ళిద్దరినీ బాగా చూసుకుంటాడు. నాకు చాలా సహాయం చేస్తాడు, వాళ్ళకి కావాల్సిన సపోర్టు అంతా ఇస్తాడు’’ అంది ఆ యువతి.

    కవలల జనన ధృవీకరణ పత్రంలో ఒకరి పేరు మాత్రమే తండ్రిగా ఒకరి పెట్టానని.. ఇద్దరికీ వేర్వేరు తండ్రుల పేర్లు పెట్టినట్టు యువతి తెలిపింది.