Ashwinishree : బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లో అడుగుపెట్టింది. ప్రేక్షకులకు గ్లామర్ ట్రీట్ తో పాటు కంటెంట్ ఇస్తూ ఎనిమిది వారాలు బిగ్ బాస్ హౌస్లో రాణించగలిగింది. 12వ వారం డబల్ ఎలిమినేషన్ లో అశ్విని, రతిక ఎలిమినేట్ అయ్యారు. అయితే అశ్విని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. సర్దార్ గబ్బర్ సింగ్, సరిలేరు నీకెవ్వరూ, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. కానీ గుర్తింపు లభించలేదు.
బిగ్ బాస్ ద్వారా అశ్విని కి క్రేజ్ దక్కింది. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా అవకాశం కొట్టేసింది. ఒక బంపర్ ఆఫర్ ఆమెకు వచ్చింది. అశ్విని లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రానికి ‘ మిస్ జానకి ‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక మూవీ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాగా త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అశ్విని పాత్ర చుట్టూ సినిమా కథ ఉంటుందట. అశ్వినికి మంచి పేరు వస్తుందని .. ప్రేక్షకులకు గుర్తుండిపోయే రోల్ అని డైరెక్టర్ సతీష్ కుమార్ వెల్లడించారు.
నాగరాజు నెక్కంటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర పూజ కార్యక్రమాలు, మూవీ అప్డేట్స్ కి సంబంధించిన వీడియోలు అశ్విని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో అశ్విని మూవీ గురించి పలు ఆసక్తి విషయాలు పంచుకుంది. బిగ్ బాస్ తర్వాత చాలా కథలు విన్నట్లు అశ్విని తెలిపింది. ఈ కథలో తన క్యారెక్టర్ కి చాలా ప్రాధాన్యత, వైవిధ్యం ఉంటుందని .. అందుకే వెంటనే సినిమా ఓకే చేసినట్లు అశ్విని వెల్లడించింది.
గతంలో అశ్విని హీరోయిన్ గా చిన్న సినిమాల్లో నటించినప్పటికీ అవి రిలీజ్ అయినట్టు కూడా తెలియదు. అవకాశాలు లేకపోవడంతో సపోర్టింగ్ రోల్స్ చేసింది.. చాలా కాలం తర్వాత హీరోయిన్ గా ఫుల్ లెన్త్ రోల్ లో నటిస్తుంది. కాగా ఆమె ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీతో అశ్విని శ్రీ విజయం అందుకుని, హీరోయిన్ గా సెటిల్ కావాలని కోరుకుంటున్నారు అభిమానులు.