SRH- Klaasan : సన్ రైజర్స్ .. ఆ క్లాసెన్ ను వాడుకోండయ్యా

అలాంటి ఆలోచన ఉండి ఉంటే కచ్చితంగా భారత స్పిన్నర్లను బరిలోకి దించాలని వారు హితవు పలుకుతున్నారు. మరోవైపు ఫిలిప్స్ కు ఒకవేళ అవకాశం కల్పిస్తే అతడు బ్యాటింగ్ తో పాటు కీపింగ్, బౌలింగ్ కూడా చేయగలడు.

Written By: NARESH, Updated On : April 9, 2024 6:41 pm

Heinrich Klaasen

Follow us on

SRH- Klaasan :  చెన్నై జట్టుతో సాధించిన విజయం తర్వాత హైదరాబాద్ జట్టు రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. పాయింట్లు పట్టికలో అయిదవ స్థానంలో కొనసాగుతున్న కమిన్స్ సేన ఉగాదినాడు మరికొద్ది గంటల్లో పంజాబ్ జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. చెన్నై జట్టుతో సొంత గడ్డపై జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ బౌలింగ్ లో అదరగొట్టింది. పటిష్టమైన చెన్నై బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేసింది.. ఈ నేపథ్యంలో జట్టులో కొన్ని మార్పులు చేసి.. పంజాబ్ జట్టుపై కూడా చెన్నై పై మాదిరి ఆట తీరును ప్రదర్శించాలని భావిస్తోంది.

హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడింది. ఇందులో రెండు జయాలు, రెండు అపజయాలు ఉన్నాయి. ఒక్క మ్యాచ్ మినహా మిగతా అన్నింటిలో హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రీ క్లాసెన్ ఊర మాస్ బ్యాటింగ్ చేశాడు. ముంబై జట్టుపై అయితే శివాలెత్తిపోయాడు. జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడిగా పరిణమించిన క్లాసెన్ పై పంజాబ్ తో జరిగే మ్యాచ్ లో ప్రయోగం చేసేందుకు హైదరాబాద్ సమాయత్తమైంది. ఈ క్రమంలో అతడికి ప్రమోషన్ దాదాపుగా ఇచ్చేసింది. క్రికెట్ కీపింగ్ నుంచి అతడిని తప్పించింది. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేయించాలని నిర్ణయించింది.

పంజాబ్ తో జరిగే మ్యాచ్ లో తుది జట్టు ఖరారయింది. ముగ్గురు ఓవర్సీస్ ఆటగాళ్లతో బరిలోకి హైదరాబాద్ జట్టు దిగనుంది. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటర్ అవసరమైతే ట్రావిడ్ హెడ్, స్పిన్నర్ అవసరమనుకుంటే షంసీ లేదా గ్లెన్ ఫిలిప్స్ కు అవకాశం ఇవ్వనుంది. వికెట్ కీపర్ గా ఉత్తరప్రదేశ్ ఆటగాడు ఉపేంద్ర యాదవ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. చెన్నై తో జరిగిన మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ పై హైదరాబాద్ మేనేజ్మెంట్ వేటు వేసింది. అతని స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించింది.

పంజాబ్ జట్టుతో మ్యాచ్ కు ముందు హైదరాబాద్ ఆటగాడు క్లాసెన్ ఫీల్డింగ్ చేశాడు. ఈ దృశ్యాలను హైదరాబాద్ జట్టు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.. అతడికి కొత్త పాత్ర కల్పించామని ప్రకటించింది. క్లాసెన్ ఇప్పటికే భీకరమైన ఫామ్ లో ఉన్నాడు కాబట్టి టాప్ -3 లో మెరుగ్గా రాణిస్తాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది.. మరోవైపు ఇప్పటికే రెండు ఓటములు, రెండు గెలుపులతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు ఇలాంటి ప్రయోగాలు చేయడం సరికాదేమోనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత మైదానంలో ఇలా చేస్తే పెద్దగా ఇబ్బంది ఉండద కానీ.. ఇతర మైదానాల్లో ఇలాంటి ఎక్స్పర్ మెంట్స్ చేస్తే ఇబ్బంది ఎదురవుతుందనే విషయాన్ని జట్టు యాజమాన్యం భావించాలని వారు సూచిస్తున్నారు.. ఇండియన్ మైదానాలపై ఫారిన్ స్పిన్నర్లతో ఆడిస్తే ఉపయోగముండదని.. అలాంటి ఆలోచన ఉండి ఉంటే కచ్చితంగా భారత స్పిన్నర్లను బరిలోకి దించాలని వారు హితవు పలుకుతున్నారు. మరోవైపు ఫిలిప్స్ కు ఒకవేళ అవకాశం కల్పిస్తే అతడు బ్యాటింగ్ తో పాటు కీపింగ్, బౌలింగ్ కూడా చేయగలడు.

జట్టు తుది అంచనా ఇలా

నటరాజన్, మయాంక్ మార్కండే, జయదేవ్, భువనేశ్వర్ కుమార్, కమిన్స్ (కెప్టెన్), నితీష్ రెడ్డి, షాబాద్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, అబ్దుల్ సమద్, ఉపేంద్ర యాదవ్, క్లాసెన్.