https://oktelugu.com/

Pushpa 2 Teaser : పుష్ప 2 టీజర్ లో ఒకే షాట్ లో కాలు తో చీర కొంగు ను తీసుకోవడానికి బన్నీ ఏం చేశాడో తెలుసా..?

ఇక అల్లు అర్జున్ సుకుమార్ కి చెప్పి కెమెరా పెట్టించాడట ఇక అప్పుడు ఆ షాట్ ని కేవలం సింగల్ టేక్ లో చేశాడట.. ఇక అప్పటికే సుకుమార్ సింగల్ షాట్ లో అదంతా రాదేమో అనే భయంతో దాన్ని డిఫరెంట్ షాట్స్ లో చేయాడానికి రంగం సిద్దం చేశాడట. కానీ అల్లు అర్జున్ డెడికేషన్ తో చాలా ఈజీగా ఆ షాట్ ను చేశాడట. ఇక ఆ షాట్ వల్లే టీజర్ కి చాలా ఇంపాక్ట్ అయితే వచ్చింది...

Written By:
  • NARESH
  • , Updated On : April 9, 2024 / 08:06 PM IST

    Allu Arjun Saree Scene

    Follow us on

    Pushpa 2 Teaser : సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అతని కోసం ఆయన అభిమానులు ఏదైనా చేయడానికి సిద్దం గా ఉంటారు. అలా పిచ్చి అభిమానాన్ని పెట్టుకున్న అభిమానుల కోసం మన స్టార్ హీరోలు వాళ్లని సాటిస్ఫై చేయడానికి వీళ్లు చేసే సినిమాల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రిస్కి షాట్స్ ని కూడా చేస్తూ సూపర్ సక్సెస్ లు అందుకుంటూ తమ అభిమానులను ఆనందపరచడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదులుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియాలో పుష్ప సినిమాతో ‘ఐకాన్ స్టార్’ గా మారాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సూపర్ డూపర్ సక్సెస్ తో ఇప్పుడు పుష్ప 2 సినిమాని చేస్తున్నాడు.

    ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా టీజర్ ని కనక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అల్లు అర్జున్ గంగాలమ్మ తల్లి గెటప్ లో ఒకడి బాడీ మీది నుంచి తన కాలును తీసుకొని ఆ కాలుతోనే తన చీర కొంగును పైకి విసరడం తో దాన్ని పట్టుకొని బొడ్లో దోపుకునే షాట్ ఒకటి ఉంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ అంత ఒకే షాట్ గా తీశారు. నిజానికి ఇంత హెవీ సీన్ ఒకే షాట్ లో ఒకే టేక్ లో రావడం చాలా కష్టమైన పని ఆ కాలితో చీర కొంగుని పైకి విసరడం అనేది ఒకేత్తు అయితే, దానిని పట్టుకునే సమయంలో అతని బాడీ చాలా స్టిఫ్ గా ఉండాలి. ఏమాత్రం బెండ్ అయిన కూడా ఆ ఇంపాక్ట్ అయితే రాదు.

    కాబట్టి ఆ మొత్తాన్ని ఒకే షాట్ లో తీయడం చాలా కష్టతరమైన పని. అయితే ఆ ప్రత్యేకమైన షాట్ కోసం అల్లు అర్జున్ విపరీతంగా కష్టపడ్డాడట. ఇక డైరెక్టర్ సుకుమార్ ఈ షాట్ కోసం 15 టేకు లు చేయించారట ఒకసారి ఒకటి సెట్ అయితే, మరోసారి మరొకటి సెట్ అవ్వడం లేదు. దాంతో సుకుమార్ ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడట. ఇంక ఆ షాట్ ఫెయిల్ అవ్వకూడదనే ఉద్దేశ్యం తో అల్లు అర్జున్ తన కాలు తో చీర కొంగుని పైకి విసిరేసి తన చేతితో దాన్ని పట్టుకోవడం ఎలా అనే దానికోసం ఒక 100 సార్లు ప్రాక్టీస్ చేశారట. ఇక దాంతో ఆయనకి క్లియర్ కట్ గా ఒక క్లారిటీ అయితే వచ్చిందట..

    ఇక అల్లు అర్జున్ సుకుమార్ కి చెప్పి కెమెరా పెట్టించాడట ఇక అప్పుడు ఆ షాట్ ని కేవలం సింగల్ టేక్ లో చేశాడట.. ఇక అప్పటికే సుకుమార్ సింగల్ షాట్ లో అదంతా రాదేమో అనే భయంతో దాన్ని డిఫరెంట్ షాట్స్ లో చేయాడానికి రంగం సిద్దం చేశాడట. కానీ అల్లు అర్జున్ డెడికేషన్ తో చాలా ఈజీగా ఆ షాట్ ను చేశాడట. ఇక ఆ షాట్ వల్లే టీజర్ కి చాలా ఇంపాక్ట్ అయితే వచ్చింది…