Bigg Boss 9 Telugu Tanuja Vs Rithu Chowdary: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) కంటెస్టెంట్స్ లో చూసేందుకు చాలా క్యూట్ గా, ఎంతో అందంగా కనిపించే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది తనూజ మాత్రమే. అనేక సూపర్ హిట్ టీవీ సీరియల్స్ లో నటించిన ఈమెకు మొదటి నుండి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె ముఖం చూసేందుకు ఎప్పుడూ కోపం గానే మనకి కనిపిస్తుంది కానీ, ఈమెలో కూడా ఫన్ యాంగిల్ ఉందని ‘కూకూ విత్ జాతి రత్నాలు’ ప్రోగ్రాం చూసిన తర్వాతే అందరికి అర్థమైంది. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుంది అనే వార్త రాగానే అందరూ చాలా సంతోషించారు. హౌస్ లో కూడా చాలా వరకు బాగానే ఉంటుంది, ఓనర్స్ కి ఓపికగా వంట చేసి పెడుతుంది, అందరితోనూ మంచిగానే ఉంటుంది కానీ, నిన్న జరిగిన ఒకే ఒక్క సంఘటన కారణంగా ఈమెపై జనాల్లో కాస్త నెగటివిటీ ఏర్పడింది.
Also Read: రాజమౌళి సినిమాల్లో ఆ రెండు సినిమాలు బాగా ఆడలేదని చెప్పిన రమా రాజమౌళి…
వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ ని కాస్త కొత్త పద్దతిలో పెట్టాడు. రెండు నెట్ గుహలను ‘X’ మార్క్ ఆకారం లో ఏర్పాటు చేసాడు బిగ్ బాస్. ఆయన ఏ ఇద్దరు కంటెస్టెంట్స్ పేర్లను పిలుస్తారో, వాళ్ళు ఈ నెట్ గుహల ద్వారా అవతల వైపుకి ఎవరైతే ముందుగా వెళ్తారో, వాళ్ళు నామినేషన్స్ నుండి తప్పించుకున్నట్టు, ఎవరైతే చివర్లో వస్తారో వాళ్ళు నామినేషన్స్ లోకి వచ్చినట్టు. ఎవరైతే ముందుగా వచ్చి సుత్తి ని అందుకుంటారో, ఎవరో ఒక కంటెస్టెంట్ ని నామినేట్ చేసి, ఆ సుత్తిని ఓనర్స్ లో ఎవరికో ఒకరికి ఇచ్చి, నామినేట్ చెయ్యమని చెప్పాలి. ఈ ప్రక్రియ లో భాగంగా బిగ్ బాస్ ముందుగా తనూజ, రీతూ చౌదరి ని పిలుస్తాడు. వీళ్లిద్దరు ఆ నెట్ గుహల నుండి క్రాస్ గా వెళ్తారు. క్రాస్ గా ఒకే స్పీడ్ లో వెళ్ళినప్పుడు ఒకరిని ఒకరు గుద్దుకోవడం సహజం.
అలా ఇద్దరు ఒకే స్పీడ్ తో వెళ్లడం వల్ల సెంటర్ పాయింట్ లో ఒకే సమయం లో చేరుకోవడం తో తనూజ రీతూ తల ని తొక్కేస్తుంది. పాపం రీతూ తలకు గాయం అవుతుంది. ఆమెకు గాయం అవ్వడం తో హౌస్ మొత్తం రీతూ వద్దకు వచ్చి, ఆమెని మెడికల్ రూమ్ కి తీసుకెళ్తారు. కానీ తనూజ మాత్రం కనీసం దగ్గరకు వెళ్లి, ఎలా ఉంది, ఏమిటి అనేది కూడా అడగదు. ఆమె కావాలని నాకు అడ్డంగా వచ్చింది అని అంటుంది. దీనికి రీతూ కూడా చాలా హర్ట్ అవుతుంది. సందర్భం ఏదైనా కానీ, మొదటి రోజు నుండి ఈమెతో స్నేహం గా ఉంటున్న రీతూ చౌదరి కి తన వల్ల తలకు గాయం అయ్యినప్పుడు దగ్గరకు వెళ్లి చూడడం మానవతా కోణం కదా, ఇక్కడ తనూజ అది మిస్ అయ్యినట్టు అనిపించింది. ఆ తర్వాత మెడికల్ రూమ్ నుండి బయటకు వచ్చిన రీతూ చౌదరి కి క్షమాపణలు చెప్పింది కానీ, అందులో ఎలాంటి సహజత్వం కనిపించలేదు. ఎదో చెప్పాలి కాబట్టి చెప్పాను అన్నట్టుగా వ్యవహరించింది. ఈ ఒక్క సంఘటన తో అబ్బో ఈమెకు కూడా ఈగో చాలా ఉంది, అనుకున్నంత మంచి అమ్మాయి అయితే కాదు అని చూసే ఆడియన్స్ కి అనిపించింది.