South Asia Politics: ఎక్కడో రగిలిన నిప్పు అడవిని మొత్తం దహనం చేస్తుంది. అలాగే ఎక్కడో ఒకచోట మొదలైన పుకారు వ్యవస్థను మొత్తం అట్టుడికేలా చేస్తుంది. దీనివల్ల జరిగినష్టం తర్వాత గాని అర్థం కాదు. వాస్తవానికి పుకార్లు సృష్టించడం సులువు. లేనిపోని వ్యాఖ్యలు చేయడం మరింత సులువు. కానీ ఆ తర్వాత పరిణామాలను అదుపు చేయడం అంత సులభం కాదు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుంది కాబట్టి ఏమీ చేయలేని దుస్థితి నెలకొంటుంది. ఇప్పుడు నేపాల్ దేశంలో జరుగుతున్న పరిణామాలు కూడా అదే విధంగా ఉన్నాయి.
Also Read: ఎంతకు తెగించారు.. నేపాల్ మాజీ ప్రధాని భార్యను సజీవంగా తగలపెట్టారు
సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంకలో ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. ముఖ్యంగా యువత రోడ్లమీదకి వచ్చారు. దానికంటే ముందు అక్కడ ప్రతిపక్ష నాయకుడి మీద విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ప్రజలు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నారు. అధికారపక్షం మీద పడ్డారు. కుటుంబ రాజకీయాలు.. అవినీతి.. ఒప్పందాలు.. ఇవన్నీ కూడా శ్రీలంకలో పరిస్థితి చేయి దాటిపోవడానికి కారణమని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. వాస్తవానికి శ్రీలంక విషయంలో అంతర్జాతీయ మీడియా ఆస్థాయిలో రెస్పాండ్ అవ్వడం అదే తొలిసారి. దాని వెనుక ఏం జరిగింది.. ఎవరు ఉన్నారు.. అని ఆరా తీస్తే అమెరికా హస్తము ఉందని తేటతెల్లమైపోయింది. ఇప్పుడు అగ రాజ్యానికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం సింహళ దేశం లో ఉంది కాబట్టి.. శ్రీలంకలో జరిగిన ఏ పరిణామం కూడా బయటికి రావడం లేదు. పైగా అక్కడి వనరుల మీద అమెరికా కంపెనీలు కన్నువేశాయి. అనుకూలమైన ప్రభుత్వం ఉండడంతో దర్జాగా దోచుకుపోతున్నాయని అక్కడి నాయకులు ఆరోపిస్తున్నారు.
అమెరికాకు సముద్రంలో చోటు ఇవ్వనందుకు బంగ్లాదేశ్ మీద కక్ష కట్టింది. బంగ్లాదేశ్ లో ఏకంగా ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఉద్యమం కాస్త అక్కడి ప్రధానమంత్రిని దేశం విడిచి పారిపోయేలా చేసింది. ఫలితంగా రకరకాల విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అల్లర్లు తగ్గలేదు. విధ్వంసం ఆగలేదు. బంగ్లాదేశ్లో ఈ స్థాయిలో దారుణం చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం అమెరికా అని షేక్ హసీనా ఆరోపించారు. ఇప్పటికీ ఆమె అదే మాట మీద కట్టుబడి ఉన్నారు. దేశంలో అల్లర్లు చోటు చేసుకోవడంతో భారతదేశంలో ఆమె ఆశ్రయం పొందారు.
ప్రస్తుతం నేపాల్ దేశంలో కూడా ఇదే స్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి. ఏకంగా పార్లమెంటుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులకు తీవ్రస్థాయిలో నష్టం చేకూర్చారు. ఇది ఎంతవరకు దారితీస్తుంది అనేది అర్థం కావడం లేదు. అక్కడి సైన్యం దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ గొడవలు తగ్గడం లేదు. అక్కడ అధికారపక్ష, ప్రతిపక్ష నాయకులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.. జరుగుతున్న గొడవల వల్ల 20 మంది దాకా చనిపోయారని తెలుస్తోంది.
మన చుట్టూ ఉన్న దేశాలలో అంతర్యుద్ధాలు సృష్టించి.. ఆర్థికంగా నష్టం చేకూర్చే ప్రణాళికను డ్రాగన్, అగ్ర రాజ్యాలు విజయవంతంగా చేపడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో రైతుల ముసుగులో జరిగిన ఉద్యమం కూడా అలాంటిదేనని.. దానిని విజయవంతంగా చేదించి మోడీ నిలబడ్డారని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఇప్పుడు కూడా మనదేశంలో అటువంటి గొడవలు సృష్టించడానికి కుట్రలు జరుగుతున్నాయని.. దీని వెనక చైనా, అమెరికా హస్తము ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.