Bigg Boss 9 Telugu Suman Shetty: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో టాస్కులు ఆడడం ముఖ్యమే, కానీ వాటిని ఎలా ఆడుతున్నాం అనేది కూడా ముఖ్యం. మొరటుగా ఆడి పక్క వ్యక్తిని తీవ్రమైన గాయపరిచే విధంగా ఉండకూడదు. నిన్నటి ఎపిసోడ్ లో డిమోన్ పవన్ ఆట తీరు చూస్తే అలాగే అనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎపిసోడ్ చివర్లో బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ మొదటి లెవెల్ ని నిర్వహించారు. ఈ టాస్క్ లో ఓనర్స్ మరియు టెనెంట్స్ ఇద్దరికీ టైమర్ ఇస్తారు. వాళ్ళ టైం తరుగుతూ వచ్చేలోపు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తూ ఉంటాడు. అది పూర్తి చేస్తే ఒక్క గంట టైం పెరుగుతుంది. అలా చివరి వరకు రెండు టీమ్స్ లో ఎవరి టైం అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు విన్నర్. అందులో భాగంగా మొదటి టాస్కు ని ఇస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఒక పెద్ద చక్రం ఉంటుంది.
Also Read: ‘లిటిల్ హార్ట్స్ ‘ మూవీ డైరెక్టర్ వాళ్ల తాత కూడా దర్శకుడనే విషయం మీకు తెలుసా..?
దాని చివర ఉన్న హ్యాండిల్ ని కేవలం ఒక్క చేత్తో మాత్రమే పట్టుకోవాలి. ఒక టీం సభ్యుడి పక్కన మరో టీం సభ్యుడు నిల్చుకోవాలి. బయట తమ టీం కి సంబంధించిన వాళ్ళని ఒకరిని ఉంచుకోవచ్చు. వాళ్ళు వచ్చి పక్క టీం వాళ్ళని గేమ్ నుండి తప్పించవచ్చు, అదే విధంగా గేమ్ ఆడుతున్న వాళ్ళు కూడా ఇదే పని చేయొచ్చు. ఈ టాస్క్ లో ఇమ్మానుయేల్, భరణి అద్భుతంగా ఆడారు. ఇక చివరి వరకు పాపం సుమన్ శెట్టి ఈ టాస్క్ లో నెట్టుకొని వచ్చాడు. కానీ చివర్లో డిమోన్ పవన్ సుమన్ ని తప్పించేందుకు మెడ పట్టుకొని విసిరి అవతలకు వేస్తాడు. సుమన్ శెట్టి అతని దెబ్బకు పల్టీలు కొట్టి మరీ పడుతాడు పాపం. దెబ్బలు కూడా చాలా గట్టిగానే తగిలాయి. సుమన్ శెట్టి ని మెడికల్ రూమ్ కి కూడా పిలిచినట్టు సమాచారం. డిమోన్ పవన్ కావాలని చెయ్యలేదు, అతని దృష్టిలో కేవలం గేమ్ గెలవాలి అనే మాత్రమే ఉంది. అందుకే సుమన్ శెట్టి ని అలా విసిరిపారేశాడని చూసేవారికి స్పష్టంగా అర్థం అవుతుంది.
అయితే సుమన్ శెట్టి కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డిమోన్ పవన్ గత వారం డేంజర్ జోన్ వరకు వచ్చి సేఫ్ అయ్యాడు. ఇప్పుడు సుమన్ శెట్టి పట్ల ఇలా ప్రవర్తించాడు. ఇది ఆయనకు బాగా నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ జనాలు సుమన్ శెట్టి ని అలా విసిరినందుకు డిమోన్ పవన్ పై కోపం తెచ్చుకొని ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పవన్ ని చూస్తే మంచోడిలాగా, అమాయకుడిలాగా అనిపిస్తున్నాడు. హౌస్ లో ఉంటే ఇతని ద్వారా కంటెంట్ భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏమి జరగబోతుందో చూడాలి మ