Hero Mouli: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది పాన్ ఇండియా రేంజ్ లో విస్తరించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా కూడా పాన్ ఇండియా లో మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా కొత్త హీరోలు సైతం ఇండస్ట్రీకి వచ్చి పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన మౌళి కూడా ఇప్పుడు ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా మారిపోయాడు. ఇక మౌళి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూయర్ నువ్వు హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడు నువ్వు హీరో ఏంటి అని అన్నవారు ఎవరైనా ఉన్నారా అని మౌళి ని అడిగాడు. ఇక దానికి మౌళి సంధానం చెబుతూ మా అమ్మే నేను హీరోను అవుతాను అంటే నమ్మలేదు.
Also Read: ‘లిటిల్ హార్ట్స్ ‘ మూవీ డైరెక్టర్ వాళ్ల తాత కూడా దర్శకుడనే విషయం మీకు తెలుసా..?
నువ్వు హీరో ఏంట్రా అంటూ హేళనగా నవ్వింది అంటూ ఆయన చెప్పడం విశేషం… మరి మొత్తానికైతే అందరి విమర్శలను ఎదుర్కొనైనా సరే ఆయన హీరోగా ఒక సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆయన చేతిలో దాదాపు మూడు నుంచి నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇక ఆ సినిమాలతో కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన తన తదుపరి సినిమాలతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ప్రస్తుతం ఇప్పుడున్న చిన్న సినిమాల్లో లిటిల్ హార్ట్స్ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. కాబట్టి ఈ సినిమాకి ఇండస్ట్రీలో ఉన్న పెద్దల నుంచి కూడా చాలా ప్రశంసలైతే దక్కుతున్నాయి.
ఇక రీసెంట్ గా సినిమా యూనిట్ మొత్తాన్ని విజయ్ దేవరకొండ పిలిచి వాళ్ళని కంగ్రాట్యులేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక మీదట కూడా మౌళి మంచి సినిమాలను చేసి తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలని కోరుకుందాం…ఇక ఇప్పటి వరకు చాలా మంది హీరోలు వస్తున్న కూడా కొత్త వాళ్ళు ఎవ్వరు ఎక్కువ రోజుల పాటు నిలబడలేకపోతున్నారు. కానీ మౌళి ఎక్కువ రోజుల పాటు హీరోగా రాణించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది…