Director Sai Marthand: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లు ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటున్న స్టార్ డైరెక్టర్లందరు తమ సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ‘సాయి మార్తాండ్ ‘ దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలన్నింటిని బ్రేక్ చేస్తూ చిన్న సినిమాల్లో ఒక పెద్ద విజయాన్ని సాధించాడు. అయితే ఈ దర్శకుడు గురించి చాలామంది చాలా రకాల కథనాలైతే వెల్లడిస్తున్నారు. అతని బ్యాగ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి చాలామంది తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తుండటం విశేషం…అయితే వాళ్ల తాత ఒకప్పుడు లెజెండరీ దర్శకుడు అనే విషయం మనలో చాలామందికి తెలియదు.
ఆయన ఎన్టీఆర్, కృష్ణ శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి లాంటి హీరోలతో సూపర్ హిట్ సినిమాలను తీశాడు. మరి ఆ దర్శకుడు ఎవరు అంటే డైరెక్టర్ బీవీ ప్రసాద్ గారు కావడం విశేషం… ఈయన మట్టిలో మాణిక్యం, మనుషులే దేవుళ్ళు, ఆరాధన, చుట్టాలున్నారు జాగ్రత్త, మేలుకొలుపు లాంటి సినిమాలు తీసి సూపర్ సక్సెస్ లను సాధించాడు.
అలాంటి దర్శకుడు యొక్క మనవడు సాయిమార్తాండ్ కావడం విశేషం… బీవీ ప్రసాద్ వాళ్ళ కొడుకులు సైతం ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్లుగా కొద్ది రోజులపాటు తమ కెరియర్ ను కొనసాగించినప్పటికి కొన్ని నష్టాలు రావడంతో ఇండస్ట్రీని వదిలేశారు. ఇక వాళ్ల తర్వాత మూడో జనరేషన్ గా ఇండస్ట్రీకి వచ్చి రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ సినిమా తీసి సూపర్ సక్సెస్ ని సాధించాడు.
మొత్తానికైతే సాయి మార్తాండ్ కి ఇండస్ట్రీ వర్గాల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించకపోయినా కూడా తన తాత పేరు ఎక్కడ వాడకుండా సోలోగా ప్రయత్నం చేసి ఇండస్ట్రీకి వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించాడు… ఇక ఏది ఏమైనా కూడా లిటిల్ హార్ట్స్ సినిమాతో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేశారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…