Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్లో హద్దులు చెరిపేసిన జంట... రొమాంటిక్ వీడియో...

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్లో హద్దులు చెరిపేసిన జంట… రొమాంటిక్ వీడియో వైరల్

బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ కథలు మామూలే. గతంలో కొన్ని జంటలు కెమెరాల ముందే రొమాన్స్ చేశాయి. లేటెస్ట్ సీజన్లో ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. ఈ క్రమంలో ఓ రొమాంటిక్ వీడియో తెరపైకి వచ్చింది.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ షో పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అమ్మాయిలు అబ్బాయిలను నాలుగు గోడల మధ్య ఉంచడం, ఆడ మగ తేడా లేకుండా ఒక చోట పడుకోవడం, ఆటలు ఆడటం వంటివి మన సంస్కృతికి వ్యతిరేకం. ఈ షో యువత ఆలోచనల మీద ప్రతికూల ప్రభావం చూపుతుందనే వాదన ఉంది. బిగ్ బాస్ షో పై ఎన్ని కేసులు వేసినా.. ప్రసారం కాకుండా ఆపలేకపోయారు.

ఇటీవల బిగ్ బాస్ హిందీ ఓటీటీలో ఇద్దరు భార్యలతో ఒక కంటెస్టెంట్ హౌస్లోకి అడుగుపెట్టాడు. ఒక భార్య ఎలిమినేట్ అయ్యింది. మరో భార్యతో హౌస్లోనే అర్ధరాత్రి శృంగారం చేశాడు. ఈ పరిణామం అతిపెద్ద చర్చకు దారి తీసింది. వారిద్దరూ భార్యాభర్తలు కాబట్టి కొంత మేర ఒప్పుకోవచ్చు. కానీ పెళ్లి కాని అబ్బాయిలు, అమ్మాయిలు రొమాన్స్ చేయడం క్షమించరాని విషయం.

తెలుగు బిగ్ బాస్ షోలో కూడా అనేక ప్రేమ జంటలు అవతరించాయి. రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి, అఖిల్ సార్థక్-మోనాల్, అభిజీత్-అలేఖ్య హారిక, షణ్ముఖ్-సిరి హన్మంత్, ఆర్జే సూర్య-ఇనాయ ఈ కోవలోకి వస్తారు. ఈ జంటల్లో ఎవరు కూడా, హౌస్ నుండి బయటకు వచ్చాక ప్రేమించుకుంది లేదు. బిగ్ బాస్ హౌస్లో ప్రేమికుల మధ్య హగ్గులు, ముద్దులు కామన్ గా చోటు చేసుకుంటాయి.

ఇక బిగ్ బాస్ సీజన్ 8 విషయానికి వస్తే… సోనియా ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నడుపుతుంది. ఆమె కాసేపు నిఖిల్ తో మరి కాసేపు పృథ్విరాజ్ తో సన్నిహితంగా ఉంటుంది. దాదాపు ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇస్తుంది. నిఖిల్ అయితే పూర్తిగా ఆమె ట్రాప్ లో పడ్డాడు. అయితే గేమ్ లో సత్తా చాటుతున్నాడు. కాబట్టి అతడి పొజిషన్ కి ఢోకా లేదు. రెడ్ ఎగ్ ఎవరికి ఇచ్చి చీఫ్ కంటెండర్ చేస్తావని అడిగితే.. సోనియాకు ఇస్తానని బిగ్ బాస్ తో నిఖిల్ చెప్పాడు.

కాగా నిఖిల్-సోనియాలకు సంబంధించిన ఓ రొమాంటిక్ వీడియో వైరల్ గా మారింది. నిఖిల్ కి ఆల్మోస్ట్ లిప్ కిస్ ఇచ్చినంత పని చేసింది సోనియా. ఆమె ఎక్సప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ నిఖిల్ ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఈ వీడియోని నెటిజెన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. సోనియా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కి వల వేస్తుంది. ఇదంతా ఆమె గేమ్ లో భాగంగానే చేస్తుంది.

మరోవైపు మూడవ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ జరుగుతుంది. విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి, నాగ మణికంఠ, పృథ్విరాజ్, అభయ్, సీత, నైనిక నామినేషన్స్ లో ఉన్నారు. అభయ్ డేంజర్ జోన్లో ఉన్నాడని సమాచారం. అతడి ఎలిమినేషన్ దాదాపు ఖాయం అన్నమాట వినిపిస్తుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper