Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి నాల్గవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ప్రేరణ కంభం గురించి ఈరోజు మనం ప్రత్యేకించి మాట్లాడుకోబోతున్నాము. చూసేందుకు ఎంతో ఆకర్షణీయమైన అందంతో కుర్రాళ్ల మనసుల్ని దోచేసే ప్రేరణ ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ తో మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఈ సీరియల్ కి ముందు ఆమె కన్నడలో ‘హర హర మహాదేవ్’, ‘ రంగనాయకి’ వంటి సీరియల్స్ లో నటించింది. సీరియల్స్ తో పాటుగా ఈమె ‘చురకత్తె’, ‘ఫిజిక్స్ టీచర్’ మరియు ‘పెంటాగాన్’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. అంతే కాదు, కన్నడ లో మినీ బిగ్ బాస్ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా కూడా వ్యవహరించింది ప్రేరణ. ఎంతో చురుగ్గా గేమ్స్ ఆడుతూ, మగవాళ్లకు సైతం తన ఆట తీరుతో చుక్కలు చూపించడం ఈమె స్టైల్.
బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభానికి ముందు స్టార్ మా ఛానల్ లో ప్రతి శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ గేమ్ షోలో ఈమె ఎంత అద్భుతంగా ఆడిందో ఆ షో చూసిన ప్రతీ ఒక్కరికి తెలుసు. ఈమె దాటికి మగవాళ్ళు కూడా నిలబడలేకపోయారు. ఈమె చలాకీతనం చూసి అప్పుడే అందరికీ అర్థం అయ్యింది, కచ్చితంగా ఈమె బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతుంది అని. అందరూ ఊహించినట్టుగానే ఈమె బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఈమె రేంజ్ కి తగ్గ గేమ్స్ రాలేదు కానీ, రాబోయే రోజుల్లో ఈమె హౌస్ లో ఉన్న మగవాళ్ళందరికీ చుక్కలు చూపించే రేంజ్ లో టాస్కులు ఆడుతుందని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ప్రేరణ కంభం రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. శ్రీపద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈమె. శ్రీపద్ బెంగళూరు లోనే టాప్ 10 ఫిజియో తెరఫీ డాక్టర్స్ లో ఒకరు అట. మొదటి రోజు ఆమె హౌస్ లోకి అడుగుపెట్టే ముందు తన భర్త ఈమె గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు విశేషంగా అలరించిన సంగతి తెలిసిందే.
తన భర్త కి దూరంగా ఇన్ని రోజులు ఎప్పుడూ లేనని, మొట్టమొదటి సారి ఆయనకీ దూరంగా మూడు నెలలు ఉండబోతున్నాని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షో తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్న ప్రేరణ, హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత సినిమాల్లో హీరోయిన్ రోల్స్ కూడా దక్కించుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇలా ఉండగా ఈ వారం నామినేషన్స్ లోకి బెజవాడ బేబక్క, శేఖర్ బాషా , నాగ మణికంఠ, విష్ణు ప్రియా, పృథ్వీ రాజ్ మరియు సోనియా రాగా, బెజవాడ బేబక్క అందరి కంటే తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.