Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం ‘దేవర’ పై ట్రేడ్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ నెల 27 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చెయ్యనున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ సినిమాకి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉన్నాయి. దాదాపుగా అన్ని ప్రధానమైన చైన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, నిన్నటి వరకు ఈ చిత్రానికి 594 షోస్ కి గాను నాలుగు లక్షల 11 వేల డాలర్లు వచ్చాయి.
సినిమా విడుదలకు 21 రోజుల ముందే ఈ స్థాయి గ్రాస్ వసూళ్లు రావడం మాములు విషయం కాదు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా 1 మిలియన్ డాలర్ మార్కుని కూడా దాటనుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఒకప్పుడు మన తెలుగు సినిమాకి 1 మిలియన్ ప్రీమియర్స్ నుండి వస్తేనే ఎంతో గొప్పగా చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు స్టార్ హీరోలకు 1 మిలియన్ ప్రీమియర్ అంటే చాలా తక్కువగా మారింది . కనీసం రెండు మిలియన్ డాలర్లు లేదా మూడు మిలియన్ డాలర్ల ప్రీమియర్ వస్తేనే ట్రేడ్ అద్భుతంగా వసూళ్లు వచ్చినట్టు భావిస్తుంది. ‘దేవర’ చిత్రానికి కూడా రెండు నుండి మూడు మిలియన్ డాలర్ల ప్రీమియర్ వసూళ్లు రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. #RRR చిత్రానికి దాదాపుగా 3.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ నుండి వచ్చాయి. ఇప్పుడు ‘దేవర’ చిత్రం #RRR ప్రీమియర్ రికార్డు ని కూడా బద్దలు కొట్టబోతుందా అనేది చూడాలి. ఒకవేళ అదే జరిగితే ఎన్టీఆర్ చరిత్ర తిరగరాసిన వాడు అవుతాడు. ఓవర్సీస్ మార్కెట్ గత రెండేళ్ల కంటే ఇప్పుడు చాలా పెరిగింది. అందుకే ఇప్పుడు 1 మిలియన్ డాలర్ అంటే చాలా చిన్న టార్గెట్ అయిపోయింది.
ఒకప్పుడు స్టార్ హీరోలకు మాత్రమే 2 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చేవి, కానీ ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని కి కూడా 2 మిలియన్ డాలర్ల వసూళ్లు అవలీలగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ‘దేవర’ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వస్తే కేవలం నార్త్ అమెరికా నుండి 10 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చేస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంటే 88 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కేవలం నార్త్ అమెరికా నుండే రాబోతుంది అన్నమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతుందో అనేది, త్వరలోనే ఈ సినిమా నుండి నాల్గవ పాటని కూడా విడుదల చేయబోతున్నారు.