Naga manikantha : ఎలిమినేషన్ అయ్యాక ‘బిగ్ బాస్ 8 ‘ కంటెస్టెంట్ నాగ మణికంఠ కి బంపర్ ఆఫర్.. ఇలాంటి అవకాశం ఎవ్వరికి రాదేమో!

ఈ సీజన్ లో నాగ మణికంఠ కోసం అంతలా ఎదురు చూస్తున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ లాగా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను అనే ధోరణిలో మణికంఠ ప్రవర్తించడం లేదు. తన వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే మణికంఠ కి ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.

Written By: Vicky, Updated On : October 22, 2024 5:36 pm

Naga manikantha

Follow us on

Naga manikantha : బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది కేవలం 7 వారాలు మాత్రమే. కానీ 16 వారాలకు రావాల్సిన క్రేజ్ ని, ఫాలోయింగ్ ని సంపాదించుకొని వెళ్ళాడు నాగ మణికంఠ. మొదటి రోజు నుండి తనకి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళాడు. ఆడియన్స్ తో పాటు విశ్లేషకులు కూడా ఇతను డ్రామాలు ఆడుతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ తనని తాను సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుంటే కానీ జనాలకు అర్థం అవ్వలేదు, నాగ మణికంఠ డ్రామాలు ఆడలేదని. అయినా ఒక మనిషి వారం, పది రోజులు డ్రామాలు చేస్తూ హౌస్ లో నెట్టుకొని రావొచ్చు, కానీ 7 వారాలు ఎలా డ్రామాలు ఆడగలడు, నాగమణికంఠ డ్రామాలు ఆడడం లేదు అనేది ఆయన అభిమానుల వాదన. అది నిజమే అని నిరూపించాడు మణికంఠ. ఆయన హౌస్ లోనే కొనసాగుతూ ఉండుంటే, టాప్ 3 వరకు వచ్చేవాడిని, టైటిల్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బిగ్ బాస్, నాగార్జున అతనికి మోటివేషన్ ఇచ్చి ఇంట్లో ఉండేలా చేసి ఉండొచ్చు. కానీ ఎందుకో ఆ పని అసలు చేయలేదు. అయితే బిగ్ బాస్ హిస్టరీ లోనే గేమ్ పై ఒక ముద్ర వేసి వెళ్లిన వాళ్ళు కొంతమంది ఉంటారు.

అలా సీజన్ 8 కి నాగ మణికంఠ ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసి వెళ్లాడని చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు వరకు మణికంఠ అంటే ఎవరో ఎవరికి తెలియదు. కానీ ఈ బిగ్ బాస్ హౌస్ ఆయనకీ అశేష ప్రేక్షాభిమానం అందేలా చేసింది. ఇప్పుడు హౌస్ లో నుండి బయటకి అడుగుపెట్టగానే, నాగ మణికంఠ ఇంటర్వ్యూస్ కోసం యూట్యూబర్లు క్యూలు కడుతున్నారు. గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూస్ కోసం ఎంతలా ఎదురు చూసారో, ఈ సీజన్ లో నాగ మణికంఠ కోసం అంతలా ఎదురు చూస్తున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ లాగా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను అనే ధోరణిలో మణికంఠ ప్రవర్తించడం లేదు. తన వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే మణికంఠ కి ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.

త్వరలోనే స్టార్ మా ఛానల్ లో మొదలయ్యే ఒక సీరియల్ లో హీరో గా నటించే అవకాశం దక్కిందట. ఇంతకు ముందు కూడా ఆయన సీరియల్స్ లో నటించాడు కానీ, అవి ఆయనకీ పెద్దగా గుర్తింపుని తీసుకొని రాలేదు. కానీ ఈసారి ఏకంగా హీరో గా నటించే అవకాశం రావడంతో ఆయన సుడి తిరిగింది అనే చెప్పాలి. అంతే కాదు సినిమాల్లో, ఎంటర్టైన్మెంట్ షోస్ లలో కూడా మణికంఠ కి మంచి ఆఫర్లు వస్తున్నాయట. ప్రతీ ఆదివారం వచ్చే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షో లో కూడా ఈయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయి, ఇక నాగ మణికంఠ కెరీర్ విషయంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.