Crime News : ఇద్దరు బాలికలను బర్త్ డే పార్టీకి పిలిచి.. మద్యం తాగించి.. యువకులు చేసిన దారుణమిదీ!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణంలో ఓ విషాద ఘటన వెలుగు చూసింది. పుట్టినరోజు వేడుకలు అని చెప్పి.. మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లిన ముగ్గురు యువకులు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Written By: Dharma, Updated On : October 22, 2024 5:48 pm

Srikakulam

Follow us on

Crime News :  స్నేహం మాటున అఘాయిత్యాలు జరుగుతున్నాయి. బర్త్డే వేడుకల పేరిట యువకులు చేసే సందడి అంతా ఇంతా కాదు. కొన్నిచోట్ల ఇది శృతిమిస్తోంది. తాజాగా ఇటువంటి ఘటనే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెలుగు చూసింది. పుట్టినరోజు వేడుకలకు ఇద్దరు బాలికలను పిలిచిన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా సెల్ ఫోన్ లో వీడియో తీశారు. ఇంటికి వచ్చిన తర్వాత బాధిత బాలికలు కుటుంబ సభ్యులుకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వరకు చేరింది. కాశీబుగ్గ పట్టణానికి చెందిన ముగ్గురు బాలికలు.. ముగ్గురు యువకులతో సన్నిహితంగా ఉంటున్నారు. పట్టణానికి దూరంగా ఉన్న కోసంగిపురం జంక్షన్ లో ఉన్న జగనన్న కాలనీ లేఅవుట్ కు వీరంతా వెళ్లారు. అక్కడ ఓ యువకుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అయితే ఆ ముగ్గురు యువకులతో పాటు బాలికలు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. దీంతో మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు యువతులపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే అందులో ఓ బాలిక ప్రతిఘటించినట్లు సమాచారం. యువకులు అత్యాచారానికి పాల్పడుతుండగా… మిగతా యువకుడు సెల్ఫోన్లో వీడియో తీసినట్లు తెలుస్తోంది. రాత్రికి ఇంటికి చేరుకున్న బాలికల తిరులో మార్పు గమనించిన కుటుంబ సభ్యులు ప్రశ్నించేసరికి అసలు విషయం బయటపడింది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని గుట్టుగా ఉంచినట్లు సమాచారం. అయితే సెల్ఫోన్లో వీడియోలు చిత్రీకరించడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

* హుటాహుటిన అధికారులు
అయితే ఈ విషయం బయటకు రావడంతో ఐసిడిఎస్ తో పాటు చైల్డ్ లైన్ అధికారులు బాధ్యత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే అప్పటికే ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులను ఒప్పించి వారు పోలీసులకు ఫిర్యాదు ఇప్పించినట్లు తెలుస్తోంది. విషయం బయటకు వెలుగులోకి రావడంతో సదరు యువకులు పెద్ద మనుషుల ద్వారా రాజీ ప్రయత్నాలకు దిగారు. అయితే బాలికలపై అత్యాచార సమాచారం అందుకున్న ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. పోలీస్ అధికారులతో మాట్లాడారు. బాధితులకు అన్ని విధాలా న్యాయం చేయాలని కోరారు.

* నిందితులు మైనర్లు?
కాగా నిందితులు సైతం మైనర్లేనని తెలుస్తోంది. స్నేహం మాటున వారు బాలికలతో కొద్దిరోజులుగా సన్నిహితంగా మెలుగుతున్నట్లు సమాచారం. పుట్టినరోజు వేడుకలకు అని మాయమాటలు చెప్పి.. మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా గంజాయి, మద్యం మత్తులో ఇటువంటి ఘటనలు జరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తోంది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.