Qualities are enough: జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా.. సరైన గమ్యం, లక్ష్యం లేకపోవడం వల్ల అది వ్యర్థమే అవుతుంది. కొందరు మంచి జీవితం కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో మంచి పద్దతులు, అలవాట్లు పాటిస్తారు. ముందు నుంచే భయం, భక్తితో ఉంటూ ఏ తప్పు చేయకుండా నిజాయితా ఉంటారు. మరికొందరు మాత్రం తమకు ఎదురంటూ లేనిది లేదని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. ఇలాంటి వారి వల్ల వారి జీవితం మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఛిన్నాభిన్నం అవుతాయి. ఇలాంటి వారు ఎవరు ఎన్ని చెప్పినా వినరు. వారికిన నచ్చింది మాత్రమే చేస్తారు. అయితే ఈ పరిస్థితి రావడానికి ముఖ్యంగా కొన్ని అలవాట్లు, లక్షణాలే కారణమని అపర చాణక్యుడు తన నీతి శాస్త్ర బోధనల్లో పేర్కొన్నాడు. అపర చాణక్యుడు చెప్పిన కొన్ని జీవిత సూత్రాలు చాలా మంది ఇప్పటికీ పాటిస్తున్నారు. వీటిలో మనిషి నాశనం కావడానికి ఉండే ప్రధాన లక్షణాల గురించి చెప్పాడు. అవేంటంటే?
చాలా మంది బతకానికి ఏదో ఒక పని చేయాలని అనుకుంటారు. ఎటువంటి లక్ష్యాలను ఏర్పరుచుకోవరు. ఈ రోజు గడిస్తే చాలు.. అని అనుకుంటారు. ఇలాంటి వారి జీవితం ఎప్పటికైనా నాశనం అవుతుంది. ఒక గోల్ ఏర్పాటు చేసుకొని దాని కోసం పని చేయడం వల్ల అందులో ఉండే మజా వేరే ఉంటుందని కొందరు చెబుతారు. కానీ లక్ష్యం లేకుండా పనులు చేయడం వల్ల జీవితం ఎప్పటికైనా వ్యర్థమే అవుతుంది. అందువల్ల జీవితంలో ఏదో ఒక టార్గెట్ ఏర్పాటు చేసుకొని దాని కోసం కష్టపడండి..
డబ్బు సంపాదించడం ముఖ్యమే. ఈరోజుల్లో డబ్బు లేకపోతే జీవితం గడవదు. కానీ ఇతరుల అవసరాలకు అప్పుడప్పుడు డబ్బును దానం చేయాలి. డబ్బు ఒకరి వద్దే ఉంటే రిలేషన్ షిప్ పెరగదు. రిలేషన్ షిప్ పెరగాలంటే ఇతరులకు డబ్బు దానం చేయాలి. అయితే మంచి వారు అనుకుంటే మాత్రమే ఇవ్వాలి. డబ్బు మాత్రమే కాకుండా ఇతర సాయం కూడా చేస్తూ ఉండాలి. మనుషులతో సంబంధాలు ఏర్పడడం వల్ల జీవితం సాఫీగా ఉంటుంది.
మనిషీ జీవితం బాగుండాలంటే మంచి అలవాట్లు ప్రధానం. కొందరు తమకు లేని చెడ్డ అలవాటును చేసుకుంటారు. వీటి వల్ల జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. ఫలితంగా సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. వీరి వల్ల తమ పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది. అందువల్ల మంచి గుర్తింపు కోసం కష్టపడాలి. తద్వారా వారితో పాటు వారి కుటుంబం కూడా హాయిగా ఉండగలుగుతుంది. మంచి పనులు చేయడం కష్టమే.. కానీ తప్పకుండా వాటిని మాత్రమే ఫాలో అయితే ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తారు.
జీవితంలో డబ్బు మాత్రమే కాకుండా మంచి గుర్తింపు ఉండాలి. ఇందు కోసం పెద్దలను గౌరవించాలి.ఇతరులతో మంచిగా ప్రవర్తించాలి. అంతేకాకుండా పెద్దలను పట్టించుకోకపోవడం గాని.. చిన్న పిల్లల పట్ల చిన్న చూపు చూడడం గానీ చేడయం వల్ల ఎప్పటికైనా ఇబ్బంది పడేది వీరే. అందువల్ల గౌరవం అనేది చాలా ప్రధానం.