Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. శివాజీ, అమర్, సందీప్, ప్రియాంక, శోభా శెట్టి, భోలే, అశ్విని, గౌతమ్ ఈ వారానికి నామినేట్ అయ్యారు. బుధవారం ఎపిసోడ్లో బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నిర్వహించాడు. బిగ్ బాస్ మారథాన్ పేరుతో నిర్వహించే టాస్క్ లలో ఎవరు ప్రతి గేమ్ లో గెలుస్తారో వారు కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఉంటారు. ఓడినవారు కంటెండర్ రేసు నుండి తప్పుకుంటారు.
ఫస్ట్ టాస్క్ ”ఫ్లోట్ ఆర్ సింక్” టాస్క్ పెట్టారు. ఈ గేమ్ సంచాలక్ గా గౌతమ్ వ్యవహరించాడు. అమర్ దీప్, తేజ, శోభా, ప్రియాంక పోటీపడ్డారు. గౌతమ్ వస్తువులు చూపిస్తాడు. అవి నీటిలో మునుగుతాయో… తేలుతాయో నలుగురు ఒకేసారి చెప్పాలి. ఈ గేమ్ లో ప్రియాంక అందరి కంటే ఎక్కువ సరైన సమాధానాలు చెప్పింది. సెకండ్ ప్లేస్ లో శోభా నిలిచింది. అమర్-తేజ మధ్య టై అయ్యింది. మరో రౌండ్ నిర్వహించగా అమర్ ఓడిపోయాడు. అమర్ కెప్టెన్సీ రేసు నుండి తప్పుకున్నాడు.
రెండో కెప్టెన్సీ టాస్క్ లో పల్లవి ప్రశాంత్, యావర్, గౌతమ్, రతిక రోజ్ తలపడ్డారు. వీరికి బాక్సులతో కూడిన ఫజిల్ ఇచ్చారు. బజర్ మోగిన వెంటనే నలుగురు తమ ముందు ఉన్న రంగు బాక్సులను ఎత్తకుండా సరైన క్రమంలో అమర్చాలి. ఈ గేమ్ కూడా మైండ్ గేమ్ అని చెప్పాలి. అనూహ్యంగా పల్లవి ప్రశాంత్ చాలా షార్ప్ గా ఆడాడు. జస్ట్ 20 సెకండ్స్ లో ఫజిల్ పూర్తి చేసి బెల్ కొట్టాడు. తర్వాత యావర్ ఫజిల్ పూర్తి చేశాడు. అనంతరం గౌతమ్. లాస్ట్ లో చేసిన రతిక రేసు నుండి తప్పుకుంది.
యావర్, గౌతమ్ లకు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ చుక్కలు చూపించాడు. టాస్క్ లలో మనోడిని బీట్ చేయడం కష్టం అని మరోసారి రుజువైంది. అనంతరం యావర్-అశ్విని మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. హౌస్లో ఎవరికి కనెక్ట్ అయ్యావని యావర్ ని అశ్విని అడిగింది. మొదట్లో రతికకు కనెక్ట్ అయ్యాను. మరలా దూరం పెరిగింది. ఇప్పుడు పర్లేదని చెప్పాడు. యావర్ కి అశ్విని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుందనిపించింది. ఇక బెస్ట్ ఫ్రెండ్స్… తేజ-శోభా ఓ విషయంలో గొడవపడ్డారు…