Pooja Murthy: బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా కాన్సెప్ట్ అంటూ ట్విస్ట్ లతో సాగుతుంది. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడు వారాలు వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేశారు.ఇలా జరగడం ఇదే మొదటిసారి. గత వారం పూజ మూర్తి ఎలిమినేట్ అయింది.ఎలిమినేషన్ తర్వాత ఆమె ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది.పూజ మూర్తి హౌస్ మేట్స్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.
శివాజీ వల్లే ఆ ఇద్దరు ఆడుతున్నారా అని యాంకర్ ప్రశ్నించింది. దానికి పూజ చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. పల్లవి ప్రశాంత్,ప్రిన్స్ యావర్ కి శివాజీ సపోర్ట్ గా ఉన్నారు. అంటే వాళ్ల గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. మనం కేవలం కొంతవరకు పుష్ చేయగలం కానీ శివాజీ కాస్త ఎక్కువ మద్దతు ఇస్తున్నారు. వారంతా కలిసి బ్యాలెన్స్డ్ గానే ఉన్నారు. వీళ్ళిద్దరికైతే అందరికంటే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పింది పూజ.
శివాజీ గారు ఆడట్లేదు,కానీ ఆడిస్తున్నాడు. కానీ ఎవరైనా ఆడట్లేదని నామినేట్ చేస్తే మాత్రం అసలు ఒప్పుకోడు అని పూజ చెప్పింది. ఇక అమర్ గురించి మాట్లాడుతూ ‘అమర్ దీప్ నాకు బయట కూడా బాగా తెలుసు. హౌస్ లోకి వెళ్ళాక బాగా మారిపోయాడు. తన ఒరిజినల్ క్యారెక్టర్ వదిలేశాడు. బయట ఉన్నప్పుడు నేను అందగాడిని అని రెచ్చిపోయాడు అమర్.
నేను అతనితో కలిసి పని చేశాను.. నేను బయట చూసిన అమర్ వేరు లోపల ఉన్న అమర్ వేరు అని పూజ చెప్పింది.అమర్ తన ఆత్మవిశ్వాసం కోల్పోయాడు అని పూజా యాంకర్ తో పంచుకుంది. నిజానికి పూజ పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన పూజ రెండు వారాలు మాత్రమే హౌస్ లో రాణించగలిగింది. ఆమె ఆట తీరు ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అవ్వలేదు అని చెప్పవచ్చు.రెండు వారాలకు గాను నాలుగు లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం.