Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారానికి చేరుకుంది . ఈ వారం మొట్టమొదటి కెప్టెన్సీ కోసం పోటీ మొదలైంది . కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ జంటలుగా మారి టాస్క్ లు ఆడాల్సి ఉంటుంది . గెలిచిన జంట కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు అని బిగ్ బాస్ చెప్పాడు .
నిన్న ఎపిసోడ్లో కెప్టెన్సీ రేస్ కి సంబంధించిన రెండో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ .” దొరికితే దొంగ దొరక్కపోతే దొర ”టాస్క్ గురించి చెప్తూ బిగ్ బాస్… నా స్నేహితుడు చాలా కాలంగా నా దగ్గర నుంచి కొన్ని వస్తువులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదు . యాక్టివిటీ ఏరియాలో నా మిత్రుడు నిద్రపోతున్నాడు . తన నిద్రను డిస్టర్బ్ చేయకుండా హింట్స్ ఆధారంగా వస్తువులు దొంగతనం చేయాలి అని చెప్పాడు కంటెస్టెంట్స్ దొరికిన వన్నీ సంచిలో వేసుకొచ్చేశారు . దొంగతనం చేసుకొచ్చిన వస్తువులతో గార్డెన్ ఏరియా లో నిలుచున్నారు .
గార్డెన్ ఏరియాలో నిల్చున్న తేజా దగ్గర ఉన్న ఫోన్ శోభా శెట్టి లాక్కుంది. దాంతో ప్రిన్స్ యావర్ ఆమె దగ్గర వస్తువులు లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పెనుగులాట చోటు చేసుకుంది. నీ చేయి నా ప్రైవేట్ పార్ట్ వద్ద ఉందని శోభా యావర్ పై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ యావర్ వదల్లేదు.
ఇదంతా గమనిస్తున్న బిగ్ బాస్ మీరు చేసే పనిని తక్షణమే ఆపేసి జంటలుగా నిలబడాలని ఆదేశించాడు. టాస్క్ యొక్క అసలు స్వరూపం మార్చే స్వేచ్ఛ మీకు ఎంత మాత్రం లేదు అన్నాడు. బిగ్ బాస్ హింట్స్ ఫాలో కాకుండా తెచ్చిన వస్తువులు పరిగణలోకి తీసుకోరు. పైగా అది మైనస్ కూడా అవుతుందని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ లో కేవలం రెండు చెప్పని వస్తువులు తెచ్చిన శివాజీ-పల్లవి ప్రశాంత్ టీమ్ ఫస్ట్ ఫ్లేస్ సాధించి మూడు స్టార్స్ గెలుచుకుంది. అనంతరం శోభా-ప్రియాంక టీమ్ కి రెండో స్థానంతో పాటు రెండు స్టార్స్ దక్కాయి. శుభశ్రీ-గౌతమ్ టీమ్ కి మూడో స్థానంతో పాటు ఒక స్టార్ దక్కింది.
యావర్-తేజ, సందీప్-అమర్ టీమ్స్ ఈ టాస్క్ లో నిరాశపరిచాయి. వారికి ఎలాంటి స్టార్స్ దక్కలేదు. చీకట్లో దొంగతనం చేసే క్రమంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దాక్కునే క్రమంలో యావర్ కి దగ్గరగా శోభా వెళ్ళింది. ఇద్దరూ చాలా సన్నిహితంగా కనిపించారు. స్క్రీన్ లో చూస్తున్న కంటెస్టెంట్స్ అది చూసి అరిచారు. ఇలాంటి ఆసక్తికర విషయంలో ఎపిసోడ్ ముగిసింది. మరి హౌస్ కి మొదటి కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలి…
