https://oktelugu.com/

Love Marriages: ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోకుండా కలిసి ఉంటున్న హీరో హీరోయిన్లు వీళ్లే…

ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ కపుల్స్ లో సూర్య జ్యోతిక ఒకరు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో మంచి సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా తమిళం లో వచ్చిన ఖాఖా ఖాఖి అనే సినిమా తో వీళ్ళ కాంబినేషన్ కి మంచి పేరు వచ్చింది.

Written By:
  • Gopi
  • , Updated On : October 5, 2023 / 08:59 AM IST

    Love Marriages

    Follow us on

    Love Marriages: సినిమా ఇండస్ట్రీలో నటించే హీరో హీరోయిన్ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండటం సాధారణమే ఎందుకంటే వాళ్లు సినిమాల్లో కలిసి నటిస్తారు కాబట్టి వాళ్ల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంటేనే వాళ్ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. అలా లేకపోతే సినిమాలు చేయడం కష్టమవుతుంది కాబట్టి ప్రతి యాక్టర్ కూడా తన కో యాక్టర్ తో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలో కొంతమంది హీరో హీరోయిన్లు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు అలాంటి వాళ్లలో సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించి ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోకుండా కలిసి జీవిస్తున్న కొన్ని జంటల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

    మహేష్ బాబు నమ్రత
    వంశీ సినిమాతో వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు.ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉంది దాంతో వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే దీనికి ముందుగా వీళ్ళ పెళ్లికి కృష్ణ గారు ఒప్పుకోనప్పటికీ మహేష్ బాబు నమ్రత ఇద్దరూ బయటికి వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణగారు వాళ్ళని పిలిచి మళ్లీ ఆయన సమక్షంలో వీళ్ళకి పెళ్లి చేయడం జరిగింది. ఇకమొత్తానికి వీళ్ళ ప్రేమని పెళ్లిగా మార్చుకున్నారు… ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో మహేష్ బాబు నమ్రత ఇద్దరు కూడా లైఫ్ ని అద్భుతంగా డిజైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు…

    సూర్య జ్యోతిక
    ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ కపుల్స్ లో సూర్య జ్యోతిక ఒకరు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో మంచి సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా తమిళం లో వచ్చిన ఖాఖా ఖాఖి అనే సినిమా తో వీళ్ళ కాంబినేషన్ కి మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తెలుగులో వెంకటేష్ హీరోగా ఘర్షణ అనే పేరుతో రీమేక్ చేశాడు.ఆ సినిమా తమిళంలో మంచి విజయం సాధించడంతో సూర్య జ్యోతిక స్టార్ హీరో హీరోయిన్లు గా గుర్తింపు తెచ్చుకున్నారు… ఇక అభిప్రాయాలు కలవడం తో మొదట ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో కొన్ని సినిమాలు రావడం ఇద్దరికీ ఒకరంటే ఒకరికి మంచి అభిప్రాయం ఏర్పాటుతో ముందు ప్రేమించుకుని ఆ తర్వాత ఆ ప్రేమని పెళ్లిగా మార్చుకున్నారు.ఇప్పుడు చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు…

    నాగార్జున అమల
    నాగార్జున సినిమాల్లోకి హీరోగా రాకముందే డాక్టర్ డి రామానాయుడు కూతురు అయిన లక్ష్మి ని పెళ్లి చేసుకున్నాడు ఇక నాగచైతన్య పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు వచ్చి విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత నాగార్జున తన కో యాక్టర్ అయినా అమలని పెండ్లి చేసుకున్నాడు. వీళ్ళ కాంబినేషన్ లో శివ నిర్ణయం లాంటి మంచి హిట్ సినిమాలు వచ్చాయి…

    Love Marriages

    ఇక ఇక్కడి వరకు వీళ్లంతా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని విడిపోకుండా కలిసి బతుకుతున్న వారు..ఇక వీళ్లే కాకుండా రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు వాళ్ళు కూడా వీళ్ల లాగే పెళ్లి చేసుకొని వాళ్ల ప్రేమ జీవితాన్ని కలకాలం గడపాలని కోరుకుందాం…