Samantha Ruth Prabhu టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమెను పరిస్థితి దిగజారడంతో మెరుగైన చికిత్స కోసం దక్షిణా కొరియా దేశానికి తరలించినట్టుగా చెబుతున్నారు. సమంత ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని.. అందుకే మెరుగైన చికిత్స అందుబాటులో ఉన్న సౌత్ కొరియాకు తరలించినట్టుగా సమాచారం.

నాగచైతన్యతో విడిపోయాక సమంత కృంగిపోయింది. ఆయన ఎడబాటును తట్టుకోలేక డిప్రెషన్ కు గురైంది. ఈ క్రమంలోనే భారీగా ఎక్సర్ సైజులు చేసి కండరాలపై బాగా ఒత్తిడి పెంచింది. మానసిక, శారీరక ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలోనే సమంతకు ఈ ‘మయోసైటిస్’ అనే అరుదైన ప్రాణాంతక చికిత్స అందుబాటులో లేని ‘కండరాల క్షీణత’ వ్యాధి సోకినట్టు సమాచారం.
ఇప్పటికే ఈ అరుదైన వ్యాధికి చికిత్స కోసం అమెరికా వెళ్లి వచ్చి ట్రీట్ మెంట్ తీసుకున్న సమంత హైదరాబాద్ లోని ఆస్పత్రిలో ఉంటూ చికిత్స కొనసాగిస్తోంది. ఇటీవలే ఆమె తన కొత్త సినిమా డైలాగ్ వెర్షన్ ను సెలైన్ పెట్టుకొనే పూర్తి చేసింది. ఇక ప్రమోషన్స్ లోనూ పాల్గొని తనకు సోకిన ప్రాణాంతక వ్యాధిని బయటపెట్టింది.
అమెరికాలో కూడా ఈ మయోసైటిస్ వ్యాధికి చికిత్స లేదట.. ఒక్క దక్షిణకొరియాలోనే అత్యంత ఆధునిక, సంప్రదాయ వైద్యం అందుబాటులో ఉందట.. అక్కడ కండరాలక్షీణతకు చికిత్స ఉందని తెలియడంతో సమంత వెళ్లినట్టు సమాచారం. స్పెషల్ ట్రీట్ మెంట్ తీసుకొని ఆరోగ్య సమస్యలను తీర్చుకోవడం కోసమే సమంత వెళ్లిందని.. ఆమె పరిస్థితి రోజురోజుకు సీరియస్ గా మారుతోందని సమాచారం.
అయితే సమంత సౌత్ కొరియా వెళ్లిందన్న వార్తలపై ఆమె కానీ.. ఆమె సన్నిహితులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికారికంగా ఎటువంటి విషయాన్ని బయటపెట్టలేదు. మీడియాలో వస్తున్న ఈ వార్తలు నిజమా? అబద్ధమా? అన్నది తెలియాల్సి ఉంది.