Bigg Boss 6 Telugu 10th Week Elimination: బిగ్ బాస్ హౌస్ అంటేనే సంచలనాలకు మారు పేరు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నాలుగు గోడల మధ్య జరిగే ఆటను జడ్జ్ చేయడం కష్టం. 24 గంటల ఫుటేజ్ లో మనం చూసేది కేవలం ఒక గంట. ఈ క్రమంలో నిర్వాహకులు ఆడియన్స్ మైండ్స్ ట్యూన్ చేయగలరు. ఒక కంటెస్టెంట్ ని ఎత్తాలన్నా దించాలన్నా వాళ్ళ చేతుల్లో పని. మంచి మాత్రమే చూపిస్తే ఆ కంటెస్టెంట్ ఫేమ్ ఆడియన్స్ లో పెరుగుతుంది. చెడు మాత్రమే చూపిస్తే నెగిటివిటీ ఊహించని స్థాయికి చేరుతుంది. కాబట్టి బిగ్ బాస్ గేమ్ 100 శాతం జెన్యూన్ కాదు.

ప్రేక్షకుల ఓటింగ్ తో సంబంధం లేకుండా కూడా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. కారణం ఎలిమినేషన్ కి నామినేటైన కంటెస్టెంట్స్ లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఎవరికీ తెలియదు. ఒక్కోసారి సోషల్ మీడియా పోల్స్ రిజల్ట్ ఎలిమినేషన్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు అసలు సంబంధం లేకుండా ఎలిమినేషన్ ఉంటుంది. ఈ సీజన్లో సూర్య, గీతూ ఎలిమినేషన్ ఊహించనిది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్న వారిద్దరూ బయటకు వస్తారని అంచనా వేయలేదు.
కాగా ఈ వారం అంతకు మించిన సంచలనాలు నమోదు కాబోతున్నాయట. టాప్ సెలబ్రిటీ బాల ఆదిత్య ఎలిమినేట్ అవుతున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. బాల ఆదిత్య ఎలిమినేషన్ లాంఛనమే అంటున్నారు. ఈ వారం బాల ఆదిత్య, ఆది రెడ్డి, రేవంత్, మెరీనా, ఇనయా, ఫైమా, శ్రీహాన్, కీర్తి, వాసంతి నామినేషన్స్ లో ఉన్నారు. వీరి నుండి బాల ఆదిత్య ఎలిమినేట్ అయ్యాడట. మరొక ట్విస్ట్ ఏమిటంటే మెరీనాను కూడా బయటకు పంపేశారని ప్రచారం జరుగుతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో బాల ఆదిత్య, మెరీనా ఎలిమినేట్ అయ్యారంటున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన బాల ఆదిత్య చంటిగాడు మూవీతో హీరోగా మారాడు. కొన్నాళ్లుగా ఆయన వెబ్ మూవీస్, సిరీస్లలో నటిస్తున్నారు. టాప్ సెలబ్రిటీ హోదాలో టైటిల్ ఫేవరేట్ గా బాల ఆదిత్య హౌస్లోకి ఎంటర్ అయ్యారు. అలాంటి బాల ఆదిత్య 10వ వారం ఎలిమినేట్ కావడం విశేషంగా మారింది. మరోవైపు ఎలిమినేట్ అయిన గీతూ, అర్జున్ కళ్యాణ్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.