Drinking Water With Meals: మనిషికి కడుపు నిండా తిండి, కంటి నిండ నిద్ర ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి రెండు కచ్చితంగా పాటించాలి. దీంతో ఏ రోగాలు దరిచేరకుండా చూసుకోవచ్చు. ఇందులో భాగంగా మనం రోజు తినే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తినేటప్పుడు ఒక ముద్దను నలభైసార్లు నమిలి తినాలని చెబుతుంటారు. లేదంటే మనకు సరిగా జీర్ణం కాదు. దీంతో అజీర్తి సమస్యలు వస్తాయి. తిన్న పదార్థం జీర్ణం కాకపోతే మలబద్ధకం సమస్య కూడా వస్తుంది. దీని వల్ల మనకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి. జీవితం సాఫీగా సాగాలంటే అన్ని చర్యలు సక్రమంగా జరగకుంటే కష్టాలు తప్పవు.

మనం భోజనం చేసే సమయంలో కొందరు బుక్క బుక్కకు నీళ్లు తాగుతుంటారు. అలా తాగడం తప్పు అని కొందరు చెబుతుంటారు. మరికొందరేమో భోజనం చేసేటప్పుడు కొన్ని నీళ్లు తాగితే తప్పులేదంటారు. ఇంకా కొందరేమో అస్సలు నీళ్లు తాగొద్దని సూచిస్తుంటారు. ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలి. దేన్ని పాటించాలి. ఏది పాటిస్తే మనకు ఆరోగ్యం చేకూరుతుందనే అనుమానాలు అందరిలో రావడం సహజమే. భోజనం చేసే సమయంలో ఎలా ఉండాలనేదానిపై నిపుణులు మాత్రం కచ్చితమైన ఆధారాలతో నిరూపిస్తున్నారు.
భోజనం సమయంలో నీళ్లు తాగకూడదు. ఒక వేళ తాగితే ఏమవుతుందంటే మనం తిన్న పదార్థం జీర్ణం కాదు. మనం తినే ఆహారం పొట్ట లోపలికి వెళ్లిన తరువాత అక్కడ దాన్ని అరిగించడానికి యాసిడ్ విడుదల అవుతుంది. అలా విడుదలైన యాసిడ్ మన ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. ఆ సమయంలో మనం నీళ్లు తాగితే యాసిడ్ పలచగా మారి తిన్న పదార్థం జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో మనకు ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం కరెక్ట్ కాదు.

ఇంకా కొందరైతే తిన్న తరువాత ఓ రెండు గ్లాసుల నీళ్లు తాగుతుంటారు. ఇది అసలు మంచిది కాదు. మన ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడే యాసిడ్ ను పలచన చేయడంతో ఎక్కువ సమయం జీర్ణం చేయడానికి తీసుకుంటుంది. ఫలితంగా మనకు ఆకలి సమస్య వస్తుంది. ఆకలి మందగిస్తుంది. తినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు తాగడం శ్రేయస్కరం కాదని పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరో చెప్పిన దాన్ని కాకుండా శాస్త్రీయంగా నిరూపించడంతో తినే సమయంలో నీళ్లు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.