Modi Pawan : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తిరేపిన మోడీ-పవన్ ల భేటి ఎలా జరిగింది? ఎలా కలిశారు? మోడీ ఎలా పవన్ ను రిసీవ్ చేసుకున్నాడు? అందులో వారు ఏం మాట్లాడుకున్నారన్నది ఎవరికి తెలియదు. పరస్పరం ఏకాంతంగా జరిగిన ఈ భేటిపై పవన్ కళ్యాణ్ ఏం బయటపెట్టలేదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ చోళలో సమావేశమయ్యారు. పవన్ తోపాటు నాదెండ్ల మనోహర్ కూడా వారి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మోదీకి పవన్ కళ్యాణ్ శాలువా కప్పి సత్కరించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ భేటి తాలూకా విషయాలు బయటకు రాకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ భేటి చాలా సహృద్భావ వాతావరణంలో సాగిందని అర్థమవుతోంది. పవన్ ను ప్రధాని మోడీ ఆప్యాయంగానే దక్కరకు తీసుకున్నారు. మోడీకి శాలువ కప్పి పవన్ సత్కరించారు. ఇక మోడీతో చాలా శ్రద్ధతో అనుకువతో పవన్ ఆయన చెప్పే వన్నీ విన్నారు. ఇప్పుడా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

