https://oktelugu.com/

మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన బిగ్ బాస్ !

‘బిగ్ బాస్ 4’ బుల్లి స్క్రీన్ ను ఉరూతలు ఊగించడానికి రోజుకొక కొత్త కొత్త గేమ్స్ తో సన్నద్ధం అవుతొంది. రోజురోజుకూ తన ప్రాభవాన్ని పెంచుకుంటూ తన ప్రభావాన్ని చూపిస్తూ పోతున్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే గత రెండు రోజుల నుండి వస్తోన్న ఎపిసోడ్స్ దుమ్ములేచిపోతుంది. ముఖ్యంగా కామెడీ సెన్స్ తో బిగ్‌బాస్ ఫిజికల్ టాస్క్‌ లతో కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వచ్చి చేరింది. నిజానికి ‘బిగ్ బాస్ తెలుగు 4’ గత కొన్ని వారాలుగా సాదాసీదా […]

Written By:
  • admin
  • , Updated On : November 26, 2020 / 06:59 PM IST
    Follow us on


    ‘బిగ్ బాస్ 4’ బుల్లి స్క్రీన్ ను ఉరూతలు ఊగించడానికి రోజుకొక కొత్త కొత్త గేమ్స్ తో సన్నద్ధం అవుతొంది. రోజురోజుకూ తన ప్రాభవాన్ని పెంచుకుంటూ తన ప్రభావాన్ని చూపిస్తూ పోతున్నాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే గత రెండు రోజుల నుండి వస్తోన్న ఎపిసోడ్స్ దుమ్ములేచిపోతుంది. ముఖ్యంగా కామెడీ సెన్స్ తో బిగ్‌బాస్ ఫిజికల్ టాస్క్‌ లతో కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వచ్చి చేరింది. నిజానికి ‘బిగ్ బాస్ తెలుగు 4’ గత కొన్ని వారాలుగా సాదాసీదా రేటింగ్స్ తోనే నడుస్తోందనేది నిజం. మొదట్లో ఉన్న ఊపు పోయింది అన్న కామెంట్ కూడా ఈ మధ్య బాగా వినిపిస్తోంది.

    Also Read: బిగ్ బాస్ హౌస్‌ లో ప్రేమలు ఎక్కువ కాలం ఉండవు !

    ఐతే, గత రెండు రోజులుగా వస్తోన్న ఎపిసోడ్స్ విచిత్రంగా ఇప్పుడు మళ్ళీ రేటింగ్ పరంగా టాప్ లోకి వచ్చింది. సాధారణంగా సండే, సాటర్ డే ఎక్కువ రేటింగ్ వస్తుంది. కానీ మిగతా రోజుల్లో మాత్రం చాలా తక్కువ వస్తూ ఉంటుంది. శుక్రవారం, గురువారం కూడా 9, 10 రేటింగ్ వచ్చింది. అయితే ఆదివారం – 11.88, శనివారం – 9.53 రాగా.. గురువారం కూడా 9.42 రావడం నిజంగా విశేషమే. ఇక బిగ్ బాస్ 4 సీజన్ డిసెంబర్ 20న ముగుస్తుంది. ప్రస్తుతం ఎక్కువుగా మోనాల్, అభిజీత్, అరియనా, సోహైల్ మంచి వోటింగ్స్ పొందుతున్నారు. మరి వీరిలో ఎవరు విన్ అవుతారో చూడాలి. ఈ షో సక్సెస్ కావడంతో “జబర్దస్త్” పడుకొంది. “జబర్దస్త్” మరీ 4, 5 రేటింగ్ లతోనే సర్దుకోవడంతో “జబర్దస్త్” మేకర్స్ కి షాక్ కి గురి చేసింది.

    Also Read: అల్లు అర్జున్ పాలిట విలన్ గా మారిన క్రేజీ హీరో?

    మొత్తానికి షోకి అనుకున్నట్టుగానే వీకెండ్స్ లో మంచి రేటింగ్ రావడం.. ఇప్పుడు వీక్ డేస్ లో కూడా మంచి రేటింగ్ రావడంతో బిగ్ బాస్ నిర్వాహకులకు మంచి ఎనర్జీని ఇచ్చినట్టు అయింది. కానీ, క్రమేణా ఇంటిలో సభ్యులలో కొంతమంది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. పైగా బుల్లితెర ప్రేక్షకులను మళ్లీ తమ వైపు నుండి పక్కకు తిరగకుండా మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. మరి ఎవరు హౌస్ లోకి వెళ్తారో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్