భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ రేపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగనుండడంతో క్రీడాకారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. 2018-19 సీజన్లో 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచిన భారత్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆస్ట్రేలియా సిద్ధమవుతుండగా, మరో సిరీస్ సొంతం చేసుకోవాలని భారత్ తహతహలాడుతోంది. అయితే ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో భారత్ తో జరిగిన మ్యాచుల్లో ఒక్కటి కూడా గెలువకపోవడం విశేషం. దీంతో ఈసారి ఆ రికార్డును చెరిపేయాలని కంగారులు సిద్ధమవుతున్నారు.