https://oktelugu.com/

Bold Beauty: బోల్డ్ బ్యూటీకి భారీ షాకిచ్చిన బిగ్ బాస్.. ఒక రోజంతా అలానే..!

Bold Beauty in Bigg Boss Non Stop Season: తెలుగులో బిగ్ బాస్ రియల్టీ షోకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ఉంది. దేశంలోని వివిధ భాషల్లో ‘బిగ్ బాస్ షో’ ప్రసారం అవుతుండగా తెలుగులో మాత్రం టాప్ రేటింగ్స్ తో దూసుకెళుతోంది. ఈక్రమంలోనే గత బిగ్ బాస్ షో ఐదు సీజన్లను బుల్లితెరపై పూర్తి చేసుకుంది. అయితే ఈసారి నుంచి ‘బిగ్ బాస్’ వినూత్నంగా డీస్నీ ప్లస్ హాట్ స్టార్లో ప్రసారమవుతూ ఓటీటీ ప్రియులను సైతం ఆకట్టుకుంటోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2022 / 10:32 AM IST
    Follow us on

    Bold Beauty in Bigg Boss Non Stop Season: తెలుగులో బిగ్ బాస్ రియల్టీ షోకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ఉంది. దేశంలోని వివిధ భాషల్లో ‘బిగ్ బాస్ షో’ ప్రసారం అవుతుండగా తెలుగులో మాత్రం టాప్ రేటింగ్స్ తో దూసుకెళుతోంది. ఈక్రమంలోనే గత బిగ్ బాస్ షో ఐదు సీజన్లను బుల్లితెరపై పూర్తి చేసుకుంది. అయితే ఈసారి నుంచి ‘బిగ్ బాస్’ వినూత్నంగా డీస్నీ ప్లస్ హాట్ స్టార్లో ప్రసారమవుతూ ఓటీటీ ప్రియులను సైతం ఆకట్టుకుంటోంది.

    Ashu Reddy

    బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ పేరుతో ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే గత సీజన్లోని కంటెస్టెంట్స్ సైతం నాన్ స్టాప్ సీజన్లో చోటు దక్కించుకొని అభిమానులను ఎంటటన్మెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ మూడో సీజన్లో పాల్గొన్న అషు రెడ్డికి ఈ సీజన్లోను ఛాన్స్ దక్కడంతో హౌస్ లో రెచ్చిపోతోంది.

    తన బోల్డ్ బిహేవియర్ తో అషురెడ్డి హాట్ టాపిక్ గా మారుతోంది. తరుచూ బూతులు మాట్లాడటంతోపాటు హాట్ హాట్ డ్రెస్సులతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. అలాగే అఖిల్ సార్థక్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు బిహేవ్ చేస్తోంది. అయితే గత వారం టాస్క్ లో అషురెడ్డి చేసిన ఓ పని కారణంగా బిగ్ బాస్ చేతిలో పనిష్మెంట్ కు గురికావాల్సి వచ్చింది.

    Also Read: Prabhas: ప్రభాస్ వల్ల అట్టర్ ఫ్లాప్ అయిన ఎన్టీఆర్ మూవీ ఏమిటో తెలుసా..?

    అసలు విషయంలోకి వస్తే.. ఈ వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ ‘హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్’ టాస్కును ఇచ్చాడు. ఇందులో గెలిచిన జట్టు సభ్యులే ఈ వారం కెప్టెన్సీకి పోటీ చేసే అర్హతను పొందుతారు. ఈ టాస్క్ లో హ్యూమన్స్‌గా అఖిల్, శివ, అషు, అనిల్, మిత్రాలు ఉండగా మిగిలినవాళ్లు ఏలియన్స్‌గా.. బాబా భాస్కర్ సంచాలకుడిగా చేశారు.

    ఈ టాస్కులో భాగంగా ఏలియన్స్‌గా ఉన్నవాళ్లు మనుషుల అర చేతులకు రంగులు పూయాల్సి ఉంటుంది. అలాగే మనుషులుగా ఉన్నవాళ్లు ఏలియన్స్ దగ్గరున్న పాట్స్‌ను దక్కించుకుని పగలగొట్టాల్సి ఉంటుంది. దీనిని బట్టి బ్యాటరీకి పవర్స్ వస్తాయి. ఈ టాస్క్ లో హ్యూమన్సే విజయం సాధించారు. అయితే ఈ గేమ్ లో ఎన్నో కొట్లాటలు, గొడవలు జరిగాయి.

    తొలిరోజే హ్యూమన్స్ టీమ్‌లోని అషు రెడ్డిని ఏలియన్స్ టీమ్ సభ్యులు ఔట్ చేశారు. అయినప్పటికీ అషురెడ్డి తన జట్టుకు సహకరిస్తూ కనిపించింది. ఇందులో భాగంగానే స్విమ్మింగ్ పూల్‌లో తన టీమ్ సభ్యురాలు మిత్రాకు ఏలియన్స్ రంగులు పూస్తుండగా.. అషు దానిపై నీళ్లు చల్లింది. దీంతో చాలామంది మైక్‌లు తడిచిపోవడంతో బిగ్ బాస్ ఆమెకు భారీ పనిష్మెంట్ ఇచ్చాడు.

    Also Read: IPL 2022- Mukesh Choudhary: బంతిని పిడుగులా విసిరిన బౌల‌ర్‌.. దెబ్బ‌కు కిండ ప‌డ్డ స్టార్ బ్యాట్స్ మెన్‌.. ఎగిరి ప‌డ్డ వికెట్‌..!

    టాస్కు సంచాలకుడిగా ఉన్న బాబా భాస్కర్‌తోపాటు ఆరియానాను బిగ్ బాస్ కన్‌ఫెషన్ రూంకు పిలిపించాడు. అషు రెడ్డి మైక్‌ను ఈరోజంతా తీసుకోవాలని వారికి సూచించాడు. దీంతో అషురెడ్డి రోజంతా మైక్ లేకుండానే ఉండాల్సి వచ్చింది. మైక్ లేకపోతే హౌస్‌లో మాట్లాడకూడదు కాబట్టి ఆమె రోజంతా సైలెంట్‌గానే ఉండిపోయింది.

    Recommended Videos: