Bharat Biotech Covaxin: ప్రపంచాన్ని కుదేలు చేసిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టెందుకు అన్ని దేశాలు గట్టిగానే కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్ కూడా కరోనా మహమ్మారిని తరిమికొట్టెందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగర్తలు, వస్తే తీసుకోవాల్సిన జాగర్తలు ఎప్పటికప్పుడు ప్రకటనల ద్వారా జనాన్ని మేల్కొలిపేలా చేస్తున్నారు. 2021 నుండే ముమ్మరంగా టీకాలు వేయిస్తున్నారు. ప్రస్తుతం 12 సంవత్సరాలు నిండిన వారికి టీకా వేస్తుండగా త్వరలోనే 2 ఏళ్లు నిండిన చిన్న పిల్లలకు టీకా వేసేందుకు సిద్దమైంది కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం దేశంలో కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ వైరస్ అధికంగా కనిపిస్తుంది. దీంతో 2 ఏళ్ళ పైబడిన చిన్నారులకు టీకా అందించాలని కేంద్రం యోచిస్తుంది. 2నుండి 12 ఏళ్ళ పైబడిన చిన్నారులకు భారత్ బయోటిక్ డెవలప్ చేసిన కోవాగ్జిన్ టీకా ఇవ్వాల్సిందిగా డీసీజీఐ కి ప్రతిపాదనలు పంపినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించాడు.
Also Read: Prashant Kishor: పీకే వ్యూహాలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా?
డీసీజీఐ ఆమోదం తెలిపిన వెంటనే టీకా వేయనున్నట్లు ఆయన తెలిపారు. 2 ఏళ్లు పైబడిన పిల్లలకు టీకాలు వేసే అంశంపై భారత్ బయోటెక్ ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే ఎక్స్ పర్ట్ కమిటీ సమావేశమై ఆ నివేదనను పరీశీలించింది. 5నుండి 12 ఏళ్ళ లోపు చిన్నారులకు బయోలాజికల్ కంపెనీ తయారు చేసిన కార్భోవాక్స్ వాక్సిన్ వేయాలని నిర్ణయించారు. ఇక 2 ఏళ్లు నిండిన పిల్లలకు కోవాగ్జీన్ టీకా వేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం దేశంలో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు రెండు టీకాలు వేస్తున్నారు. ఐతే 15-18 వయసు పిల్లలకు జనవరి 3 నుండి కోవాగ్జీీన్ టీకా వేయనున్నారు. ప్రభుత్వ టీకా కేంద్రాలతోపాటు, ప్రయివేట్ టీకా కేంద్రాల్లో కూడా ఈ టీకా అందుబాటులో వుంటుంది. మార్చ్ 16 నుండి 12 ఏళ్ళ లోపు పిల్లలకు టీకాలు వేస్తున్నారు. 12 నుండి 14 ఏళ్ళ పిల్లలకు కార్బోవాక్స్ టీకా వేస్తున్నారు ఐతే ఈ టీకా కేవలం ప్రభుత్వ టీకా కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో వుంటుంది.
దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటి డేటా ప్రకారం భారత్ లో కొత్తగా 2,380 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,30,49,973 కు చేరుకోగా ఇందులో 13,433 యాక్టీవ్ కేసులు వున్నాయి. ప్రస్తుతం డైలీ పాజిటీవ్ రేట్ 0.53 గా వుంది. ఏది ఏమైనా ఇప్పటివరకు చిన్నపిల్లలకు అందుబాటులో లేని టీకాలు ఇప్పుడు అందుబాటులోకి రానుండడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:TDP Mahanadu 2022: మహానాడుకు అన్నగారి కుటుంబసభ్యులు… జూనియర్ ఎన్టీఆర్ పైనే చంద్రబాబు ఫోకస్
Recommended Videos: