Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Bheemla Nayak Movie: పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో మరోసారి ఘనంగా...

Pawan Kalyan Bheemla Nayak Movie: పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో మరోసారి ఘనంగా తెలిసింది

Pawan Kalyan Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన మూడో రోజు కలెక్షన్స్ విషయంలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గలేదు అని ఈ సినిమా నిరూపించింది. నిజానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఫస్ట్ వీక్ పడుతుంది అనుకున్నారు. కానీ, ఫస్ట్ త్రీ డేస్ […]

Pawan Kalyan Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన మూడో రోజు కలెక్షన్స్ విషయంలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గలేదు అని ఈ సినిమా నిరూపించింది. నిజానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఫస్ట్ వీక్ పడుతుంది అనుకున్నారు.

Pawan Kalyan Bheemla Nayak Movie
Pawan Kalyan Bheemla Nayak Movie

కానీ, ఫస్ట్ త్రీ డేస్ కలెక్షన్స్ చూస్తే.. ఈ సినిమా మూడు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిపోయేలా ఉంది. కాగా ‘భీమ్లా నాయక్’ కోసం మూడేళ్లుగా పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కాగానే థియేటర్ల వద్ద భారీ హంగామా నెలకొంది. ఏది అయితే ఏం.. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. ముఖ్యంగా రెండో రోజూ భీమ్లా నాయక్‌ వసూళ్లు అదిరిపోతున్నాయి.

Also Read: మ‌రో వివాదంలో చిక్కుకున్న మోహన్ బాబు కుటుంబం.. ఏమైందంటే..?

వీకెండ్‌ కావడంతో అభిమానుల హోరుతో నిర్మాతల ఖజానా కాసుల గలగలతో నిండింది. నిజానికి మరిన్ని రికార్డులను భీమ్లా నమోదు చేయాల్సింది. ఏపీలో టికెట్‌ రేట్ల కారణంగా బాహుబలి రికార్డును బ్రేక్ చేయలేదు. రెండో రోజు రెండు రాష్ట్రాల్లో బాహుబలి2 రూ. 14.80 కోట్ల షేర్ రాబడితే భీమ్లా రూ. 13.14 కోట్లు వసూలు చేశాడు. పుష్ప రూ. 13.70 కోట్లతో రెండో ప్లేస్‌లో ఉంది.

Pawan Kalyan Bheemla Nayak Movie
Pawan Kalyan Bheemla Nayak Movie

అదే ఏపీలో అన్ని సినిమాలకు ఉన్న టికెట్ రేట్లు ఉండి ఉంటే..బాహుబలి రికార్డులు కూడా ‘భీమ్లా నాయక్’ దెబ్బకు కొట్టుకుపోయేవి. మొత్తానికి పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో మరోసారి బాక్సాఫీస్ కి ఘనంగా తెలిసి వచ్చింది.

Also Read: పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్రీట్.. భీమ్లానాయక్ అట్టర్ ఫ్లాప్ అట !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper