Singer Parvathi: ఊరంతా వెన్నెల…మనసంతా చీకటి… అంటూ తాను పాడిన పాటతో.. తన ఊరిలో వెలుగుల నింపి.. అందరి మనస్సులో నిలిచింది గాయని ‘పార్వతి’. తన మధురమైన పాటతో తమ ఊరికి ఆర్టీసీ బస్సు వచ్చేలా చేసింది. ఆమె కోరిక విని రవాణా శాఖ అధికారులు ఆ ఊరికి బస్సు ఏర్పాటు చేశారు. అయితే, ఈ బస్సు వెనుక సింగర్ స్మిత కృషి ఎంతో ఉంది. పార్వతిది మారుమూల పల్లెటూరు.. పైగా రవాణా వ్యవస్థ కూడా లేని ప్రాంతం.

అయితే పార్వతి పాటకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సింగర్ స్మిత, పార్వతి పాటకు ఫిదా అయ్యింది. ఎలాగైనా పార్వతి కోరికను తీర్చాలని నిర్ణయించుకున్న స్మిత.. ఏపీలోని ఇద్దరు మంత్రులను బస్సు కోసం రిక్వెస్ట్ చేసింది. వారిలో ఒకరు బొత్స సత్యనారాయణ కాగా.. మరోకరు పేర్ని నాని. ఈ ఇద్దరి సాయంతోనే స్మిత, పార్వతి ఊరుకి బస్సు వెళ్లేలా చేయగలిగింది.
Also Read: ఏపీలో సినిమా టికెట్ల రేట్ల పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
పార్వతి గ్రామం లక్కసాగరం’. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ గ్రామం కోసం ప్రత్యేకంగా బస్సు వేయడం సాధ్యం కాదు అని మొదట రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే, స్మిత మాత్రం పట్టు వదలకుండా బొత్స సత్యనారాయణను కలిసి, పార్వతి పాడిన పాటను వినిపించి.. ఆమె కోరిక గురించి వివరించి బస్ ఆ గ్రామానికి వెళ్లేలా చేయమని పట్టుబట్టింది. స్మిత మాటను కాదు అనలేక బొత్సా సత్యనారాయణ ఆమెను మంత్రి పేర్ని నాని వద్దకు పంపారు.

పేర్ని నాని కూడా స్మితకు నచ్చచెప్పాలని చూసి.. చివరకు ప్రభుత్వం తరపున ఆ వూరికి బస్సు తిరిగేలా కావాల్సిన అన్నీ పనులను చకచకా చేయించారు. స్మిత, పార్వతి కోరికనే కాదు ఓ ఊరి కలను కూడా తీర్చింది. ఆఖరకు బస్సు వచ్చేలా చేసింది. అయితే, ఈ ఇద్దరు మంత్రులు లేకపోతే తాము ఇచ్చిన మాట నెరవేరేది కాదేమో అని వినయంగా క్రెడిట్ మొత్తం ఆ మత్రులకు ఇచ్చేసింది స్మిత.
ఏది ఏమైనా సింగర్ స్మిత మంచితనానికి ‘లక్కసాగరం’ గ్రామమే కాదు, తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఆమె మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకుని ఏన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని కోరుకుందాం. స్మిత మంచి మనసుకు మా ‘ఓకేతెలుగు’ తరఫున ప్రత్యేక అభినందనలు.