Bharateeyudu 2: భారతీయుడు 2 ట్రైలర్ డేట్ ఫిక్స్ అయిందా.? అందులో హైలెట్ గా నిలిచేవి ఇవేనా..?

Bharateeyudu 2: ప్రస్తుతం ఆ పనిలోనే శంకర్ ఉన్నాడట. ఇక వచ్చే నెల మొదటి వారంలో ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసి రెండో వారంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు...

Written By: Gopi, Updated On : June 22, 2024 3:15 pm

Bharateeyudu 2 Movie Trailer

Follow us on

Bharateeyudu 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు కమలహాసన్… ప్రస్తుతం ఈయన శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు 2 అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక జూలై 12వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం ఆ పనిలోనే శంకర్ ఉన్నాడట. ఇక వచ్చే నెల మొదటి వారంలో ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసి రెండో వారంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు… అయితే ఈ ట్రైలర్ లో ముఖ్యంగా కమలహాసన్ ను హైలెట్ చేస్తూ ట్రైలర్ వదలబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరి కొంత మంది మాత్రం ఈ సినిమాలో సిద్ధార్థ్ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. ఆయన మాత్రమే సినిమాకి హైలెట్ గా నిలుస్తాడు. కాబట్టి ట్రైలర్లో ఆయన గురించి ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ చెబుతున్నారు.

Also Read: Kalki Movie: కల్కి సినిమాకి సెన్సార్ కట్ చేసిన సీన్స్ వల్ల ఎంత నష్టం జరగబోతుందో తెలుసా..?

కానీ సినిమా యూనిట్ మాత్రం ఈ సినిమాలో కమలహాసన్ మాత్రమే హైలైట్ అవుతాడు. ట్రైలర్ కూడా ఆయన మీదనే వస్తుందని వాళ్ళు చెబుతున్నారు. ఇంకా మరి కొంతమంది మాత్రం భారతీయుడు 3 సినిమా షూటింగ్ కూడా ఇందులోనే కలిపి కొంతవరకు పూర్తి చేశారని అంటున్నారు. నిజానికి భారతీయుడు 3 సినిమా కూడా వస్తుందా లేదా అనే విషయం మీద శంకర్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి ఇక దానికి సంబంధించిన విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…

Also Read: Krack Movie: క్రాక్ సినిమాలో వరలక్ష్మి పాత్రకి ముందుగా ఆ స్టార్ నటిని తీసుకోవాలనుకున్నారా..?

ఇక ఈనెల 27వ తేదీన వస్తున్న కల్కి సినిమాలో కమలహాసన్ విలన్ గా నటించాడు. కాబట్టి ఈ విలన్ పాత్ర ఆయన హీరోగా చేసిన భారతీయుడు సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఎందుకంటే కల్కి సినిమా వచ్చిన 15 రోజుల లోపే భారతీయుడు 2 సినిమా వస్తుంది. కాబట్టి దాన్ని దీన్ని పోల్చి చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా కమలహాసన్ కి మంచి విజయాన్ని అందిస్తుందా లేదా అనేది…