Rishabh Pant: గిల్ క్రిస్ట్, సంగక్కర రికార్డులను గల్లంతు చేసాడు.. మున్ముందు పంత్ ఎన్ని అద్భుతాలు చేస్తాడో..

గురువారం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్లో అయితే ఏకంగా గిల్ క్రిస్ట్, సంగక్కర వంటి వారి రికార్డులను బద్దలు కొట్టాడు. గతంలో కీపర్ లకు సాధ్యం కాన్ రికార్డులను తను అధిగమించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 22, 2024 3:42 pm

Rishabh Pant

Follow us on

Rishabh Pant: టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ప్రతిభ చూపుతున్నాడు . తిరుగులేని ఫామ్ తో టీమ్ ఇండియాకు అవసరమైన పరుగులు సాధిస్తున్నాడు. విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురై.. చాలా రోజులు మంచానికే పరిమితమై.. ఇబ్బంది పడిన రిషబ్ పంత్.. ఫినిక్స్ పక్షి లాగా మళ్లీ మైదానంలోకి తిరిగి వచ్చాడు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు కెప్టెన్ గా అదరగొట్టిన రిషబ్.. టి20 వరల్డ్ కప్ లోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు.

గురువారం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్లో అయితే ఏకంగా గిల్ క్రిస్ట్, సంగక్కర వంటి వారి రికార్డులను బద్దలు కొట్టాడు. గతంలో కీపర్ లకు సాధ్యం కాన్ రికార్డులను తను అధిగమించాడు. ఎబి డివిలియర్స్, గిల్ క్రిస్ట్, సంగక్కర రికార్డులను గల్లంతు చేసాడు.

ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో పంత్ కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. ఆ పరుగులు టీమిండియా విజయానికి కీలకంగా మారాయి. అంతేకాదు వికెట్ కీపింగ్ కూడా అద్భుతంగా చేశాడు. ఏకంగా మూడు క్యాచ్ లు అందుకున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో అతడు 10 ఔట్లలో తన వంతు పాత్ర పోషించాడు. తద్వారా టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక ఎడిషన్లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు.

గతంలో ఈ రికార్డు లెజెండరీ వికెట్ కీపర్, ఆడం ఆడం గిల్ క్రిస్ట్, సంగక్కర పేరు మీద ఉండేది. వీరు ముగ్గురు కలిసి ఒకే టి20 వరల్డ్ కప్ లో తొమ్మిది డిస్మిసల్స్ లో పాలుపంచుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పంత్ గుర్భాజ్, నాయిబ్, నవీన్ ఉల్ హక్ ఇచ్చిన క్యాచ్ లు అందుకొని, ఈ రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు.

రిషబ్ పంత్ 2021 t20 వరల్డ్ కప్ లో టీమిండియా లోకి వికెట్ కీపర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆటోర్నిలో టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టింది. ఇక 2022 t20 వరల్డ్ కప్ లో దినేష్ కార్తీక్ వికెట్ కీపర్ గా బాధ్యతలు చేపట్టాడు. రోడ్డు ప్రమాదానికి గురై ఏడాదిన్నర పాటు అంతర్జాతీయ క్రికెట్ కు పంత్ దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకొని అటు బ్యాటింగ్, ఇటు వికెట్ కీపింగ్ లో రాణిస్తున్నాడు.